Summer Trains to Tirupati : వేసవి సెలవులు రావడంతో తిరుమలలో రద్దీ పెరగనుంది. దాంతో ఏపీలోని పలు ప్రాంతాల నుంచి స్పెషల్ ట్రైన్‌లను నడపడానికి రెడీ అవుతోంది దక్షిణ మధ్య రైల్వే. అందులో భాగంగా మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా తిరుపతికి 16 సమ్మర్ స్పెషల్ రైళ్ళను నడుపుతున్నట్టు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్.

రైళ్ల టైమింగ్స్ ఇవే 

1) ట్రైన్ నెంబర్ 07121 తిరుపతి -మచిలీపట్నం సమ్మర్ స్పెషల్ ఈ ఆదివారం అంటే 13.04.2025 నుంచి 25.05.2025 ప్రతీ సండే నడవనుంది. ఈ ట్రైన్ లో 2AC, 3AC, స్లీపర్, జనరల్ క్లాస్‌లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైలు రాత్రి 10:20కి తిరుపతిలో బయలుదేరి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, పెడన స్టేషన్‌లలో ఆగుతూ సోమవారం ఉదయం 7:30 కి మచిలీపట్నం చేరుకుంటుంది.

2) ట్రైన్ నెంబర్ 07122 మచిలీపట్నం తిరుపతి సమ్మర్ స్పెషల్ 14.04.2025 నుంచి 26.05.2025 ప్రతీ సోమవారం నడవనుంది ఈ ట్రైన్‌లో 2AC, 3AC, స్లీపర్, జనరల్ క్లాస్‌లు ఉంటాయి. ఈ రైలు ప్రతీ సోమవారం సాయంత్రం 5:40 కి మచిలీపట్నంలో బయలుదేరి పెడన, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు,నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్‌లలో ఆగుతూ మంగళవారం ఉదయం 3:20కి తిరుపతి చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో తెలిపింది.