Fake Compaign : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) పై టీడీపీ (Tdp) సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (Dhulipalla Narendra Kumar ) ఫైరయ్యారు. టిడిపి అధికారంలోకి వస్తే అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తామని, తాను చెప్పినట్లు తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడని మండిపడ్డారు. ఓట్ల కోసం నీఛమైన స్ధాయికి దిగజారుతున్నాడని ధూళిపాళ్ల విమర్శించారు. జగన్ ఇచ్చే చిల్లర పైసలకు కక్కుర్తి పడుతున్న పేటియం బ్యాచ్, కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు చిల్లరపోస్టులు పెడుతోందన్నారు. కుల, మత రహిత ఆధునిక భారత దేశం కోసం అంబేద్కర్‌ చేసిన పోరాటంపై తెలుగుదేశం పార్టీకి, నేతలకు ఎంతో గౌరవం ఉందన్నారు. 


సైకో పాలన సాగిస్తున్న జగన్ అంటూ మండిపాటు
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు, అణగారిన వర్గాలపై దాడులు చేస్తున్న జగన్...సైకో పాలన సాగిస్తున్నాడని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టించి... ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రజలను అయోమయానికి గురి చేసి...తిరిగి అధికారంలోకి రావాలన్న కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు జగన్ ను నమ్మే పరిస్ధితుల్లో లేరని,  తప్పుడు ప్రచారానికి అంబేద్కర్ ను వాడుకుంటున్నందుకు జగన్ సిగ్గుపడాల్సిన అవసరం ఉందన్నారు.  అసత్య ప్రచారాలు చేసే  వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


వరుసగా 5సార్లు ఎమ్మెల్యేగా గెలుపు


1994లో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి రోడ్ ప్రమాదంలో మృతి చెందడంతో నరేంద్ర రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి టి. వెంకటరామయ్య పై 21,729 ఓట్ల మెజారిటీ సాధించారు. 1994 నుండి 2014 వరకు వరుసగా 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్టు నెలకొల్పారు. 2019లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. నరేంద్ర 2003 లో పార్టీ రైతు విభాగం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడిగా , గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా భాద్యతలు నిర్వహించారు. సంగం పాల డైరీ ఛైర్మన్ గానూ పని చేశారు.