Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ- జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సీఎం జగన్ ఓడిపోవడం ఖాయమని, తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత తప్పిదాలు జరగనివ్వమని, ఓట్ల చీలిక రానివ్వమని అన్నారు. తమ కూటమి అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, మెగా డీఎస్సీ అభ్యర్థులకు అండగా ఉంటామన్నారు. మద్యపాన నిషేధం నుంచి డీఎస్సీ వరకు జగన్ మాట తప్పారని, వైసీపీని గద్దె దించడమే జనసేన లక్ష్యమని తేల్చిచెప్పారు. 


నాలుగో విడత వారాహి విజయాత్రలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అవనిగడ్డలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఓట్లు చీలిపోవడం వల్ల ఐదేళ్ల విలువైన కాలం పోయిందని, ఈసారి అలా కానివ్వనని అన్నారు. ఏపీ భవిష్యత్ కోసమే ఓట్లు చీలనివ్వనని చెప్పానని, ప్రత్యేక హోదా కోసం ప్రధానితో విబేధించానని అన్నారు. వచ్చే ఎన్నికలు కురుక్షేత యుద్దమని జగన్ అంటన్నారని, కురుక్షేత యుద్దంలో మేం పాడవులమని, మీరు కౌరవులని అన్నారు. 30 వేలకుపైగా టీచర్ల పోస్టులు  ఖాళీగా ఉన్నాయని అంటున్నారని, 2018 నుంచి డీఎస్సీ ప్రకటన రాలేదన్నారు.
ఎన్నికల సమయంలో డీఎస్సీ వేస్తామని జగన్ హామీ ఇచ్చి మరిచారని పవన్ విమర్శలు గుప్పించారు.


'గత పదేళ్లకాలంలో మా పార్టీ అనేక దెబ్బలు తింది. ఆశయాలు, విలువల కోసం మేం పార్టీ నడుపుతున్నాం. అనుభవజ్ఝులను జైల్లో పెట్టిన వ్యక్తితో నేను తలపడుతున్నా. నేను ధైర్యంగా జగన్‌ను ఎదుర్కొంటా.  ముఖ్యమంత్రి పదవి కోసం నేను వెంపర్లాడను. అధికార మదం ఉన్న వైసీపీ నేతలను ఎలా ఎదుర్కొవాలో నాకు తెలుసు. మూడు తరాలుగా రాజకీయాలు చేసే వ్యక్తితో పోరాటం చేస్తున్నా. డ్రాప్ అవుట్స్, మిస్సింగ్‌లపై శ్వేతపత్రం విడుదల చేయాలి. యువత భవిష్యత్తు బాగుండాలని ఎప్పుడూ అనుకుంటా. డబ్బుకు అమ్ముడుపోయానని వైసీపీ నేతలు ఆరోపిస్తన్నారు. డబ్బు మీద, నేలమీద నాకు ఎప్పుడూ కోరిక లేదు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఓటు చీలకూడదని అనుకున్నా. మనం, మన పార్టీల కంటే ఈ రాష్ట్ర నేల చాలా ముఖ్యం' అని పవన్ తెలిపారు.


తన నైతిక బలంతోనే ఎంతో బలమైన జగన్‌తో గొడవ పెట్టుకుంటున్నానని, ఓట్ల కొనేందుకు తన దగ్గర డబ్బలు లేవని పవన్ చెప్పారు. బైజూస్‌ను బత్తాయి జ్యూస్‌లా పిండేశారని, వైసీపీ హయాంలో 3.88 లక్షల మంది విద్యార్థలు డ్రాపవుట్ అయ్యారని ఆరోపించారు. వైసీసీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందరికి ఉద్యోగాలు వచ్చాయని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం చెప్పే అభివృద్ది ఎక్కడని, జగన్ అద్బుతమైన పాలకుడైతే తనకు రోడ్డుపైకి వచ్చే అవసరం లేదన్నారు. ఇసుక దోపిడీ, అవినీతి గురించి ప్రధాని దృష్టికి తీసుకెళ్దామని అనుకున్నానని, ఈ దేశ ప్రధానికి జగన్ గురించి తెలియదా? అని ప్రశ్నించారు. సమాఖ్య స్పూర్తి కోసం ఎన్నికైన ప్రభుత్వాన్ని గౌరవించాలని అన్నారు. పోలీసు ఉద్యోగు కష్టనష్టాలు తనకు బాగా తెలుసని, తాము అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల రుణం తీర్చుకుంటామని పవన్ హామీ ఇచ్చారు.