బ్రో సినిమాలో మంత్రి అంబటి డ్యాన్స్‌ను ఇమిటేట్ చేస్తూ ఓ సీన్ పెట్టారు. ఇంటర్వెల్‌ తర్వాత వచ్చే ఈ సీన్‌ థియేటర్‌లో ప్రేకక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇస్తోంది. అదే టైంలో ఆ సీన్‌ సోషల్ మీడియాలో కూడా ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతోంది. అయితే ఇప్పుడు ఇది జనసేన, అంబటి రాంబాబు మధ్య సోషల్ మీడియా వార్‌కు దారి తీసింది. 


ఈ ఏడాది సంక్రాంతి సంబరాల్లో మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్ చేశారు. స్వతహాగా నటుడైన అంబటి మంచి ఈజ్‌తో ఆ డ్యాన్స్ చేశారు. అప్పట్లోనే ఆ డ్యాన్స్‌ చాలా వైరల్‌ అయింది. అయితే ఆ డ్యాన్స్‌ను పోలి ఉండేలా బ్రో సినిమాలో ఓ సీన్ క్రియేట్ చేశార. అందులో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ... అంబటి రాంబాబును ఇమిటేట్ చేస్తారు. 


సినిమా రిలీజ్ అయిన తర్వాత గతంలో రాంబాబు చేసిన డ్యాన్స్‌ వీడియోకు, సినిమాలో వచ్చిన సీన్‌ను జత చేసి జనసైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. సినిమాలోని మిగతా సీన్స్ ఎలా ఉన్నాయో అనేదానిపై కంటే ఈ పృథ్వీ, పవన్ మధ్య వచ్చే ఎపిసోడ్‌పైనే ఎక్కువ చర్చ నడుస్తోంది. మంత్రిని టార్గెట్ చేస్తూనే ఈ సీన్ పెట్టారనే టాక్ నడిచింది. రీయల్‌, రీల్ వీడియోను జత చేసి అంబటి రాంబాబుకు ట్యాగ్ చేయడం మొదలు పెట్టారు. 


పవన్ కల్యాణ్ అభిమానులు చేస్తున్న ప్రచారంపై అంబటి రాంబాబు ట్విట్టర్‌ వేదికగానే స్పందించారు. గెలిచినోడి డ్యాన్స్ సంక్రాంతి- ఓడినోడి డ్యాన్స్  కాళరాత్రి అని చెమక్కును ట్యాగ్ చేశారు. దాన్ని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ట్యాగ్ చేశారు. ఇప్పుడు దీన్ని వైసీపీ అభిమానులు షేర్ చేస్తున్నారు.