Machilipatnam Rice Missing Case: మచిలీపట్నం రేషన్ బియ్యం తగ్గుదల కేసులో కీలక పరిణామం

Continues below advertisement

అమరావతి: ఏపీలో సంచలనం రేపిన వైసీపీ నేత, ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన మచిలీపట్నం గోదాముల్లో రేషన్ బియ్యం తగ్గుదల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గోదాములో బియ్యం మాయం కేసులో కీలక నిందితుడైన గోదాము మేనేజర్ మానస్ తేజ బ్యాంక్ ఖాతాలో రూ.1.18 కోట్ల మేర లావాదేవీలు జరిగాయని విచారణలో భాగంగా పోలీసులు గుర్తించారు. 

Continues below advertisement

రెండు రోజుల కస్టడీలో మానస తేజను బ్యాంకు లావాదేవీలపై పోలీసులు ప్రశ్నించారు. తన కుటుంబసభ్యుల నుంచి భారీగా అప్పులు తీసుకున్నానని బుకాయించే ప్రయత్నం చేశాడు. గోదాము వద్ద హమాలీలకు చెల్లించే డబ్బులు అని, కొన్ని పేమెంట్స్ పెండింగ్‌లో ఉన్నాయంటూ పోలీసుల విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. రేషన్ బియ్యం అమ్మి సొమ్ము చేసుకున్న నగదు రూ.27 లక్షలు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.  మిగతా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి ఖాతాల నుంచి మానస తేజకు చేరిందని పోలీసులు మరోసారి విచారించనున్నారు. 

Continues below advertisement