Prakasam Barrage is safe Repairs Completed of Prakasam Barrage Gates | అమరావతి: ప్రకాశం బ్యారేజీ వద్ద ఇటీవల వరదల సమయంలో దెబ్బతిన్న గేట్ల మరమ్మతులు పూర్తి చేసింది ఏపీ ప్రభుత్వం. బోట్లు ఢీకొట్టడంతో గత వారం 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్ల దెబ్బతిన్నాయి. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో అధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది విజయవంతంగా కౌంటర్ వెయిట్ల మరమ్మతులను సోమవారం పూర్తి చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల స్థానంలో స్టీల్ తో పటిష్టంగా తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లను ఇంజినీర్లు విజయవంతంగా ఏర్పాటు చేశారు. 


కేవలం 5 రోజులలోపే ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న మూడు గేట్లు 67, 69, 70 వద్ద ఇంజినీర్లు, అధికారులు భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేశారు. రిటైర్డ్ ఇంజినీర్, నిపుణుడు కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో తక్కువ సమయంలోనే బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేశారు. బెకెమ్ ఇన్ ఫ్రా సంస్థ ఈ గేట్ల మరమ్మతులు చేపట్టి పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగి.. రేయింబవళ్లు పనిచేసిన సిబ్బంది, ఇంజినీర్లు, అధికారులను కన్నయ్యనాయుడు సన్మానించారు. తమకు విలువైన సూచనలు ఇస్తూ మార్గనిర్దేశం చేసిన కన్నయ్యనాయుడిని సైతం ఇంజినీర్లు, అధికారులు సన్మానించారు.


Also Read: Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ మరో 20 ఏళ్లే పని చేస్తుంది- ఏబీపీ దేశంతో కన్నయ్య సంచలన కామెంట్స్