రేపటి(శుక్రవారం) నుంచి మూడు రోజుల పాటు వైయస్సార్‌ జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు.కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది. కడప అమీన్‌పీర్‌ దర్గాలో ప్రార్ధనలు, వివిధ ప్రెవేట్‌ కార్యక్రమాలకు హాజరు అవుతారు. కమలాపురంలో బహిరంగ సభ, పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుడతారు. పులివెందుల, ఇడుపులపాయలలో క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్ధనలు, అభివృద్ది పనులు, ప్రారంభోత్సవాల్లో జగన్ పాల్గొంటారు.


ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11.30 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. 11.50 – 12.20 కడప అమీన్‌పీర్‌ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తారు. 12.35 – 12.45 పరిశ్రమల సలహాదారు రాజోలి వీరారెడ్డి నివాసానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి నివాసానికి చేరుకుంటారు. 1.15 – 1.25 మాధవి కన్వెన్షన్‌ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ఖాన్‌ కుమారుడి వివాహ వేడుకలకు హాజరవుతారు. ఆ తర్వాత 2.05 గంటలకు కమలాపురం చేరుకుంటారు. 2.15 – 3.45 వరకు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన, బహిరంగసభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం 4.50 ఇడుపులపాయ చేరుకుని వైయస్సార్‌ గెస్ట్‌హౌస్‌లో రాత్రికి అక్కడే బస చేస్తారు.


24.12.2022 షెడ్యూల్‌


ఉదయం 9 గంటలకు వైయస్సార్‌ గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి వైయస్సార్‌ ఘాట్‌కు చేరుకుంటారు. 9.10 – 9.40 వైయస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తారు. 10.00 – 12.00 ఇడుపులపాయలోని చర్చిలో ప్రార్ధనల్లో పాల్గొంటారు. 12.40 పులివెందులలోని భాకరాపురం చేరుకుంటారు. 1.10 – 1.20 విజయ హోమ్స్‌ జంక్షన్‌ను ప్రారంభిస్తారు. 1.30 – 1.40 కదిరి రోడ్డు జంక్షన్‌ను, విస్తరణ రోడ్డును ప్రారంభిస్తారు. 1.50 – 2.00 కూరగాయల మార్కెట్‌ ప్రారంభిస్తారు. 2.05 – 2.20 మైత్రి లే అవుట్‌ను ప్రారంభిస్తారు. 2.35 – 2.50 రాయలాపురం వంతెనను ప్రారంభిస్తారు. 3.00 – 3.30 డాక్టర్‌ వైయస్సార్‌ బస్‌స్టాండ్‌ను ప్రారంభించి ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. 3.35 – 3.55 అహోబిలపురం స్కూలు అభివృద్ది పనులను ప్రారంభిస్తారు. 4.05 – 4.20 10 ఎంఎల్‌డీ ఎస్‌టీపీని ప్రారంభిస్తారు. 4.30 – 4.45 జీటీఎస్‌ను ప్రారంభిస్తారు. తర్వాత సాయంత్రం 5.40 గంటలకు ఇడుపులపాయ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. జగన్ పర్యటన నేపద్యంలో అదికారులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.


25.12.2022 షెడ్యూల్‌..


ఉదయం 8.40 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి 9.05 గంటలకు పులివెందుల చేరుకుంటారు. 9.15 – 10.15 సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్‌ ప్రార్ధనల్లో పాల్గొంటారు. కుటంబ సభ్యులతో కలసి జగన్ పండుగను జరుపుకుంటారు.10.25 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి 12.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.తాడేపల్లి నివాసం కు వచ్చిన తరువాత క్యాంపు కార్యాలయం నుంచి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.