ప్రముఖ దర్శకుడు, నటుడు దేవా కట్టా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఉద్దేశించే పోస్ట్ పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. దేవా కట్టా చేసిన ట్వీట్‌ను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ట్యాగ్ చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో నేరం రజువయ్యే వరకు మీరు దోషి కాదని, అదే నియంతృత్వంలో మీరు దోషి కాదని నిరూపించబడే వరకు మీరు దోషి అంటూ ట్వీట్ చేశారు.