Andhra Pradesh News | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరాల నియంత్రణకు టెక్నాలజీని విచ్చలవిడిగా వాడేస్తోంది. దాంతో తప్పు చేస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ, ఏ తప్పు చేసి దొరికిపోతారో అర్థం కాక టెన్షన్ పడుతున్నారు. సీఎం చంద్రబాబు (Chandrababu) ఆదేశాలతో నేరాల నియంత్రణకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. ఈ క్రమంలో డ్రోన్ కెమెరాల (Drone Cameras)లో తాము దొరికిపోవడంతో ఇద్దరు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కృష్ణా జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో గుడివాడ పరిధిలో ఇంజనీరింగ్ కాలేజ్ వెనుక వైపు చెట్ల కింద కూర్చుని బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్నారు. ఆ తరువాత మందు కొడుతూ ఇద్దరు డ్రోన్ కెమెరాలకు చిక్కారు. డ్రోన్ కెమెరాలను గమనించగానే ఆ ఇద్దరు అక్కడి నుంచి లేచి పరుగులు తీశారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. డ్రోన్ కెమెరా ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించి, మద్యం సేవిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.
నారా లోకేష్ ఫన్నీ రియక్షన్‘సార్ గాయ్స్.. నేను మీకు హెల్ప్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే మీరు హాయిదా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ దొరికిపోయారు. ఏపీ పోలీసులు ఏర్పాటు చేసిన డ్రోన్లు తమ పనిని నిర్వర్తించారు. పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారని నారా లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.