విజయవాడ బస్ స్టాండ్ లో మూడేళ్లకు పైగా మూత పడిన 'Y స్క్రీన్స్' థియేటర్ మళ్ళీ తెరుచుకుంది. ఇప్పుడు 'R సినిమాస్ ' పేరుతో మరో పదిహేను రోజుల్లో ప్రేక్షకులకు అందబాటులోనికి రానున్నాయి రెండు స్క్రీన్స్.
విజయవాడ బస్ స్టాండ్ లో సినిమా థియేటర్స్.. అప్పట్లో ఒక సెన్సేషన్ రాష్ట్ర విభజన జరిగి అమరావతి రాజధాని గా ప్రకటించిన క్రొత్తల్లో విజయవాడ లో చాలా మార్పులు జరిగాయి వాటిలో ఒకటి విజయవాడ బస్ స్టాండ్ లో మూవీ థియేటర్స్ ఏర్పాటు. 'Y స్క్రీన్స్ ', పేరుతో రెండు స్క్రీన్ ల థియేటర్ ఆ మధ్య బాగా పాపులర్ అయింది. రాజధాని అమరావతి లో పనుల కోసం దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజల టైమ్ పాస్ కోసం బస్ స్టాండ్ లో వెయిట్ చెయ్యాల్సిన అవసరం లేకుండా తక్కువ ఖర్చు తోనే క్రొత్త సినిమాలు Y స్క్రీన్ లో సినిమాలు చూసేవారు. మూవీ చూడ్డం కోసం విజయవాడ సిటీ లోకి వెళ్లాల్సిసిన అవసరం ఉండేది కాదు. దానివల్ల ట్రాన్స్ పోర్ట్ ఖర్చు వాళ్లకు మిగిలేది. సినిమా టికెట్ రేట్ కూడా 100-125,మధ్యే ఉండేది. పెద్ద హీరోల సినిమాలు అన్నీ ఈ థియేటర్ లో రిలీజ్ అయ్యేవి.
దెబ్బ కొట్టిన కోవిడ్... రెంటల్స్
Y స్క్రీన్ థియేటర్స్ ను గోదావరి జిల్లాలకు చెందిన 'యువరాజ్ ' సంస్థల యాజమాన్యం నడిపేది. Y స్క్రీన్స్ రెంట్ కోసం RTC కి 4-5లక్షల రూపాయలు చెల్లించేవారని చెప్పుకునేవారు. దానికి బదులు గా థియేటర్ తో పాటు దాని పక్కన ఉన్న స్థలాన్ని కూడా మైంటైన్ చేస్తూ చిన్న చిన్న వ్యాపారులకు అద్దెకు ఇచ్చేవారు. ఈ మోడల్ నచ్చి హైదరాబాద్ MGBS బస్ స్టాండ్ లో కూడా మూవీ థియేటర్స్ ఓపెన్ చెయ్యడానికి అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం ఉత్సాహం చూపింది.అయితే కోవిడ్ టైం లో వ్యాపారం దెబ్బ తినడం, వైజాగ్ కు రాజధాని వెళ్ళిపోతోందన్న వార్తల నేపథ్యంలో ప్రజలు అమరావతి కి అంతకు ముందులా రాకపోవడం వంటివి 'Y స్క్రీన్ ' ఆదాయం ఫై పెద్ద ఎఫెక్ట్ చూపించింది. దానితో రెంట్ లు కట్టలేక.. ఆదాయం సరిపడా రాక "Y స్క్రీన్స్ " మూత పడింది.
మూడేళ్ల తరువాత మళ్ళీ తెరుచుకున్న థియేటర్స్
ఇప్పుడు ప్రభుత్వం మారడం, అమరావతి పనులు మళ్ళీ మొదలవడం తో విజయవాడ కు జనాల రాక పెరిగింది.దానితో నగరానికి కు చెందిన G. దినేష్ కుమార్ అనే వ్యక్తి ఈ థియేటర్స్ ను RTC వద్ద నుండి రెంట్ కు తీసుకుని పూజతో ప్రారంభించారు. ప్రస్తుతం రిపేర్ వర్క్స్ నడుస్తున్నాయి. ఇకపై ఈ థియేటర్స్ R సినిమాస్ (రవి సినిమాస్ ) గా నడువబోతున్నట్టు ఆయన ABP దేశం కు తెలిపారు. రెండు థియేటర్స్ కలిపి రోజూ 8 షోస్ ఉంటాయని కేవలం థియేటర్స్ ను మాత్రమే తాము అద్దెకు తీసుకోవడం వల్ల RTC కి చెల్లించే రెంట్ నెలకు రెండున్నర లక్షలే పడుతుంది అని అందుకు RTC యాజమాన్యానికి థాంక్స్ అని అన్నారు. టికెట్ రేట్స్ కూడా ప్రజలకు అందుబాటులో 125 రూపాయలు మాత్రమే ఉంటుందని దినేష్ కుమార్ చెప్పారు. UFO టెక్నాలజీ ద్వారా మూవీస్ ని ప్రదర్శిస్తామని క్వాలిటీ లో తేడా ఏమీ ఉండదన్న దినేష్ థియేటర్ ఆవరణలో పిల్లల కోసం చిన్న గేమింగ్ జోన్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు
అఖండ 2 తో ఓపెనింగ్
ప్రస్తుతం ఈ థియటర్ రినోవేషన్ పనులు వేగంగా చేస్తున్నారు. ఏ మాత్రం వీలున్నా బాలకృష్ణ-బోయపాటి ల 'అఖండ-2' తో R సినిమాస్ ప్రారంభిస్తామని ఒకవేళ అప్పటికి పనులు కాకపోతే మాత్రం మరో పదిహేను రోజల్లో థియేటర్స్ ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని దినేష్ అన్నారు. ఏదేమైనా అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం గా మారిన బెజవాడ బస్ స్టాండ్ లో మూవీ థియేటర్స్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుండడం విజయవాడ వాసులకు అనందం కలిగిస్తోంది అనడం లో ఎలాంటి డౌట్ లేదనే చెప్పాలి.