South Central Railway: విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నడిచే రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. ట్రాక్‌ నిర్వహణ పనుల కారణంగా రైళ్లను నిలిపివేసినట్లుగా రైల్వే అధికారులు తెలిపారు. ఇంకా కొన్ని రూట్లలో నడిచే రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్టుగా రైల్వే అధికారులు వివరించారు. ఈ నెల 21 నుంచి ఆగస్టు 15 వరకు విజయవాడ మీదుగా వెళ్లే ఏకంగా 25 రైళ్లను రద్దు చేసినట్టుగా వివరించారు. ఈనెల 24 నుంచి 28 వరకు 8 రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు. మరో 11 రైళ్లను దారి మళ్లించనున్నారు. పాక్షికంగా రద్దు చేసిన రైళ్లను రామవరప్పాడు స్టేషన్‌ వరకు మాత్రమే నడపనున్నట్టుగా రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.


దారి మళ్లించిన వివిధ రైళ్ల వివరాలను ఇక్కడ తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు డివిజన్ విడుదల చేసిన ప్రకటనలో చూడవచ్చు.