రోజూ అందరూ తిరిగే రోడ్డు. పోలీసులు కూడా ఆ దారి గుండానే చాలాసార్లు పెట్రోలింగ్ చేశారు. చాలా రోజుల నుంచి అక్కడో కారు పార్క్ చేసి ఉంది. కానీ దాన్ని ఎవరూ గమనించలేదు. రోజులు గడిచే కొద్ది ఆ ప్రాంతంలో దుర్వాసన వచ్చింది. భరించలేనంత కంపు రావడంతో అప్పుడు స్థానికులు ఆ కారును పరిశీలించారు. అంతే వారి ఫ్యూజులు ఎగిరిపోయాయి.
కృష్ణాజిల్లా పటమటలంకలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పటమటలంకలోని డి మార్ట్ సమీపంలో విఎంసీ స్కూల్ వద్ద పార్కింగ్ చేసిన కారులో డెడ్ బాడీ లోకల్స్‌ను, పోలీసులను పరుగెత్తించాయి.
AP37 BA 5456 నెంబర్ ఉన్న ఇండిగా కారులో మృతదేహం కనిపించింది. మూడు రోజుల నుంచి కారు అక్కడే ఉందని స్థానికులు చెబుతున్నారు. కానీ ఎవరికీ అనుమానం రాలేదు. పోలీసులు కూడా అదే మార్గంలో తిరుగుతుంటారు. వాళ్లకి కూడా ఎలాంటి డౌట్ రాలేదు.
కారు నుంచి దుర్వాస రావడంతో స్థానికులు వెళ్లి చూశారు. అందులో డెడ్‌బాడీ ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ స్టార్ట్ చేశారు. సిసికమెరాల ఆధారంగా కేసును ఛేదించే పనిలో ఉన్నారు విజయవాడ పోలీసులు.
అయితే పోలీసుల తీరుపై స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల నుంచి కారు రోడ్డుపక్కనే నిలిపి ఉంటే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. కనీసం రాత్రులు పెట్రోలింగ్ చేసే సిబ్బందికి అయినా అనుమానం వచ్చి ఉండాలి కదా అంటు నిలదీస్తున్నారు.