Gade Saikrishna Case: గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న కానిస్టేబుల్స్‌ అశోక్, నాని లు సూర్యారావు పేటలోని ఏసీపీ ఆఫీసులో లొంగిపోయారు. వీళ్లిద్దరు సీఐ నాగరాజుకు సహకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే నాగరాజుతోపాటు కానిస్టేబుల్ బాబురావును అరెస్టు చేశారు. వీళ్ల అరెస్టుతో సాయికృష్ణ మృతదేహాన్ని ఏం చేశారనే విషయాలపై క్లారిటీ రానుంది. 

Continues below advertisement

గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో మొదట సస్పెండెడ్‌ సీఐ నాగరాజు అరెస్టు తర్వాత కానిస్టేబుల్ నాని, అశోక్ అరెస్టు ఖాయమని తేలిపోయింది. అసలు సాయికృష్ణకు సంబంధించిన సమాచారంపై నాగరాజు నోరు విప్పలేదు. దీంతో అసలు సాయికృష్ణ మృతదేహాన్ని ఎలా మాయం చేశారు. అసలు అతని మృతి కారణాలు ఏంటీ, అతని అరెస్టు తర్వాత ఏం జరిగిందనే విషయాలపై క్లారిటీ రాలేదు. దీంతో కేసు ముందుకు కదల్లేదు. అందుకే నాగరాజుకు కళ్లు, చెవులుగా ఉన్న స్నేహితుడు సురేష్‌, కానిస్టేబుల్స్‌ అశోక్, నానిని విచారిస్తే కేసులో పురోగతి ఉంటుందని సిట్ అధికారులు ప్రయత్నించారు. అయితే నాగరాజు అరెస్టు అయిన క్షణం నుంచి వీళ్ల ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 

పరారీలో ఉన్న వీళ్ల ముగ్గురి కోసం సిట్ అధికారులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. అయితే చివరకు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఒప్పించి లొంగిపోయేలా సఫలీకృతమయ్యారు. సాయికృష్ణను లాకప్‌డేత్ చేశారని  ఈకేసులో తప్పించుకునే ఛాన్స్ లేదని, విచారణకు సహకరిస్తే మంచిదని కుటుంబాలను ఒప్పించి నోటీసులు ఇచ్చారు. దీంతో రెండు రోజలు క్రితం నాగరాజు స్నేహితుడు సురేష్ సిట్ అధికారులకు లొంగిపోతే, రెండు రోజుల తర్వాత సోమవారం కానిస్టేబుల్స్‌ నాని, అశోక్‌ ఇద్దరూ ఏసీపీ మానస ఎదుట లొంగిపోయారు. వెంటనే వారిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ పూర్తి అయిన తర్వాత వారిని కోర్టులో హాజరుపరిచే ఛాన్స్ ఉంది. 

Continues below advertisement

ఈ సాయికృష్ణ కేసులో మరో కానిస్టేబుల్‌ను కూడా సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఇద్దరు కానిస్టేబుల్స్ లొంగిపోక ముందే కానిస్టేబుల్ బాబురావును అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని విచారిస్తున్న క్రమంలోనే అశోక్, నాని లొంగుబాటు జరిగింది. వీళ్ల అరెస్టుతో కేసులో పురోగతి కనిపిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో వీరి అరెస్టుతో మొత్తం అరెస్టుల సంఖ్య ఐదుకు చేరింది.