CBN Karakatta House: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న కరకట్టపై ఇంటిని జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ నాలుగు రోజుల క్రితమే సీఐడీ ఓ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. విజయవాడ ఏసీబీ కోర్టు ఈ పిటిషన్ పై వాదనలు విననుంది. చంద్రబాబు ఉంటున్న నివాసం.. లింగమనేని రమేష్ పేరిట ఉంది. అయితే దీన్ని చంద్రబాబు అక్రమంగా పొందారని.. దాన్ని జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ నాలుగు రోజుల క్రితమే సీఐడీ దరఖాస్తు చేసుకుంది. విచారణ తర్వాత ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది.  


అసలేం జరిగిందంటే?


గుంటూరు జిల్లా ఉండవల్లలిలోని కరకట్ట రోడ్డుపై లింగమనేని రమేష్ కు చెందిన డోర్ నెంబర్ 7-3-378/1 గల ఇంట్లో కొన్నేళ్లుగా చంద్రబాబు అద్దెకు ఉంటున్నారు. రాజధాని నగర బృహత్ ప్రణాళిక డిజైనింగ్ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్ మెంట్, కంతేరు, కాజ, నంబూరు గ్రామాల ప్రాంతీయాభివృద్ధి ప్రణాళికల ద్వారా లింగమనేని ఆస్తులు, భూముల విలువ పెరగడానికి చంద్రబాబు దోహద పడ్డారని సీఐడీ ఆరోపణ తద్వారా వారికి అనుచిత లబ్ధి కల్గించారని సీఐడీ అభియోగిస్తోంది.


ఇందుకు ప్రతిగానే క్విడ్ ప్రో కో కింద చంద్రబాబుకు లింగమనేని రమేష్ తన ఇంటిని ఉచితంగా ఉచ్చారనేది సీఐడీ ఆరోపణ. ఈ క్రమంలోనే ఆ ఇంటిని జప్తు చేసేందుకు సీఐడీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద, ఇటు కోర్టులో అనుమతి కోసం ట్రై చేస్తోంది. ఇప్పటికీ వైసీపీ సర్కారు ఈ ఇంటిని జప్తు చేసేందుకు ఓకే కూడా చెప్పేసింది.


ఈ ఒక్క ఇల్లే కాకుండా టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి పి. నారాయణ.. బినామీల పేరిట కొన్న ఆస్తులుగా పేర్కొంటూ మరికొన్నింటిని కూడా జప్తు చేసేందుకు ఏపీ సర్కారు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు హోం శాఖ కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఈనె 12వ తేదీన రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా మరోసారి సీఐడీ అధికారులు కోర్టుకు వెళ్లగా.. నేడు విచారణ జరగనుంది.