Bonda Umamaheswara Rao  Issue:కాపు నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను రాష్ట్రమంతటా జరుగుతున్నారు ఆ సామాజిక వర్గ నేతలు. పార్టీలకతీతంగా జరుగుతున్న ఈ సభల్లో కాపు నేతలు చాలామంది పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఇటీవల గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ పాల్గొన్నారు. అయితే అదే సభకు వైసిపి మాజీమంత్రి అంబటి రాంబాబు సహా ఇతర కీలక నేతలు హాజరయ్యారు. అలాంటి వారితో బొండా ఉమా కలిసి ఒకే సభలో పాల్గొనడం పొలిటికల్‌గా చర్చను తెర తీసింది. ఆ సమయంలోనే బొండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. "కాపు సామాజిక వర్గ డిమాండ్లను తెలుగుదేశం గతంలో సరిగా పట్టించుకోలేదని , దానివల్ల 2019 ఎన్నికల్లో  టిడిపి ఓడిపోయిందని "ఆయన అన్నారు. "ముద్రగడ పద్మనాభం చేసిన ఉద్యమం వల్లే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవాల్సి వచ్చిందని, రాష్ట్రంలో 25 శాతం జనాభా ఉన్న కాపులకు జనాభా దామాషా ప్రకారం నిధులు, పదవులు దక్కాలని" బొండా ఉమా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నాయి. టిడిపి అనుబంధం సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో బొండా ఉమాకు వ్యతిరేకంగా పోస్టులు కనబడుతున్నాయి. అదే సమయంలో కాపు సామాజిక వర్గ నేతలు బొండా ఉమా అన్న మాటలను సపోర్ట్ చేస్తున్నారు. దానితో ఏపీలో రాజకీయంగా ఈ మొత్తం ఇష్యూ పెద్ద సంచలనమే సృష్టించింది.

Continues below advertisement

వివరణ ఇచ్చిన బొండా ఉమా 

అధిష్టానం నిర్ణయాలను వ్యతిరేకించేలా మాట్లాడిన బొండా ఉమాను సస్పెండ్ చేయాలంటూ  కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో కనపడటంతో  బొండా ఉమ దీనిపై వివరణ ఇచ్చారు. అధిష్టానానికి తన వివరణ ఇచ్చేందుకు సిద్ధమే అని అయితే అయితే ఇలాంటి సభల్లోనే పాల్గొన్న వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ లాంటి వాళ్లను కూడా వివరణ అడుగుతారా అంటూ ఆయన ప్రశ్నించారు. తాను పాల్గొంది వైసిపి సభ కాదని కేవలం ముద్రగడ సంస్మరణ సభ మాత్రమే అని బొండా ఉమామహేశ్వరరావు తన సన్నిహితుల వద్ద అన్నారు.

త్రి సభ్య కమిటీ వేసిన చంద్రబాబు 

ఈ మొత్తం వ్యవహారం అటు ఇటు తిరిగి చంద్రబాబుకే చుట్టుకునేలా కనపడడంఫై సీరియస్ అయిన అధిష్టానం పల్లా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడు, కిలారు రాజేష్‌తో ఒక త్రిసభ్య కమిటీని నియమించింది. బొండా ఉమా ఈ కమిటీ ముందు హాజరై తన వివరణ ఇవ్వాలని తెలిపింది అధిష్టానం. ఈ అంశం మొత్తం ఇప్పుడు ఎంత సున్నితంగా బొండా ఉమా పై యాక్షన్ తీసుకుంటే ఆ సభకు హాజరైన మిగిలిన టిడిపి నేతలపైనా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. పైగా కాపు సామాజిక వర్గానికి టిడిపి వ్యతిరేకమా అనే అభిప్రాయం జనాల్లోకి తీసుకెళ్లే ప్రమాదం ఉంటుంది. అలా కాదని ఏ చర్య తీసుకోకపోతే  అధిష్టానం నిర్ణయాన్ని తప్పు పట్టినా పార్టీ నేతలపై చర్యలు ఉండవా అంటూ  మరో వర్షం జనాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. దానితో ఈ మొత్తం ఎపిసోడ్లో  బొండా ఉమా తాను ఇరుక్కున్నారా ? లేక అధిష్టానాన్ని ఇరికించేసారా అనే చర్చ ఏపీ రాజకీయాల్లో మొదలైంది.

Continues below advertisement