YS Jagan holds review meeting on housing: పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు అవసరం అయిన అన్ని చర్యలు యుద్ద ప్రాతిపదికన తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇళ్ళ నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
పేదల ఇళ్ళ నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష...
గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతను పరీక్షించేందుకు మొత్తంగా 36 ల్యాబ్స్ ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్ కు అధికారులు వెల్లడించారు. ఇళ్ల నిర్మాణంలో ఉపయోగించే మెటల్ నాణ్యత పై 285 పరీక్షలు, సిమెంటు పైన 34 పరీక్షలు, స్టీలు పై 84 పరీక్షలు, ఇటుకల పై 95 టెస్టులు.... ఇలా పలురకాల పరీక్షలు నిర్వహించామని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. ఎక్కడ లోపం వచ్చినా, వెంటనే గుర్తించి నాణ్యతను పెంచుకునేందుకు ల్యాబులు ఉపయోగపడుతున్నాయని అధికారులు సీఎం జగన్ కు వెల్లడించారు.
పేదల సొంతింటి కలను తీర్చాలి... జగన్
సొంత ఇల్లు అనేది పేదవాడి కల అని, ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపం ఉండకూడదని ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. సుమారు 30 వేల మందికి ఇళ్లనిర్మాణం కోర్టు కేసుల కారణంగా జాప్యం జరిగిందని, వీరికి త్వరలోనే పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. దీని కోసం అసవరమైన భూ సేకరణకోసం అన్నిరకాల చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకూ చేసిన ఖర్చు రూ.7630 కోట్లు అని జగన్ వెల్లడించారు. ఇప్పటి వరకూ మొత్తంగా రూ.13,780 కోట్లు కేవలం ఇళ్ల నిర్మాణం కోసమే తమ ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు. ఇప్పటివరకూ సుమారుగా 2.75 లక్షల ఇళ్లను పూర్తిచేశామని, మరో మరో 74వేల ఇళ్లలో శ్లాబు వేసే పనులు జరుగుతున్నాయని, మరో 79 వేల ఇళ్లు రూఫ్ లెవల్లో ఉన్నాయని అన్నారు. మార్చి నాటికి పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద చేపట్టిన ఇళ్లలో సుమారు 5 లక్షల ఇళ్లు పూర్తిచేసే దిశగా పనులు జరుగుతున్నాయని అన్నారు.
టిడ్కో ఇళ్ల పై సీఎం సమీక్ష....
టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు తమ ప్రభుత్వం గణనీయంగా సహాయం అందించిందని సీఎం జగన్ తెలిపారు.ఈ మూడున్నర సంవత్సరాలలో ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలు, ఉచితంగా 300 అడుగులు ఇళ్లు, మిగిలిన కేటగిరీల లబ్ధిదారులకు తమవంతుగా చెల్లించిన వాటిపై సబ్సిడీ ఇవ్వడంతో పాటు, ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలిపారు. అధికారులు అందించిన వివరాలు ప్రకారం,టిడ్కో ఇళ్ల కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన ఖర్చు రూ.8015 కోట్లు అయితే ఈ ప్రభుత్వం చేసిన ఖర్చు, పేదలకు కల్పించిన ప్రయోజనాలు విలువ చూస్తే మొత్తంగా రూ.20,745 కోట్లని జగన్ తెలిపారు. టిడ్కో ఇళ్ల నిర్మాణ ఖర్చుకింద, మౌలిక సదుపాయాల కోసం ఈ మూడున్నర సంవత్సరాల్లోనే రూ.8,734 కోట్లు ఖర్చుచేశామని, దీంతోపాటు 300 అడుగుల ఇళ్లను ఉచితంగా ఇవ్వడం వల్ల దాదాపు రూ.10,339 కోట్ల రూపాయల లబ్ధి పేదలకు జరిగిందని ఆయన వెల్లడించారు. ఇళ్ల నిర్మాణం కోసం, ఉచితంగా ఇసుక పంపిణీ, తక్కువ ఖరీదుకే సామాగ్రిని అందించడం వలన కలిగిన ప్రయోజనం రూపేణా ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు రూ.13,757.7 కోట్లు కాగా,ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టడానికి కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.3,117 కోట్లు ఖర్చు చేశామని జగన్ అన్నారు.
తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, రహదారుల తదితర సదుపాయాల కోసం చేస్తున్న ఖర్చు రూ.32,909 కోట్లుని వివరించారు. జగనన్న కాలనీల్లో కేవలం మౌలిక సదుపాయాల కల్పన కోసమే చేసిన ఖర్చు రూ.36,026 కోట్లుని వివరించారు.పేదలకు ఇళ్ల పట్టాల కింద ప్రభుత్వ భూములు 28,554.64 ఎకరాలుసేకరించగా, వీటి విలువ రూ.17,132.78 కోట్లుని తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీకోసం ప్రభుత్వం డబ్బు పెట్టి కొన్న భూమి 25,374.66 ఎకరాలు కాగా, ఈ భూముల విలువ సుమారు. 15,364.5 కోట్లుని తెలిపారు.విశాఖలో పేదలకు పంపిణీ చేసిన భూముల విలువ రూ.12,405 కోట్లు,అయితే,ఇళ్ల పట్టాల కోసం ఇచ్చిన ఇతర భూములు 13,425.14 ఎకరాలకు రూ.11,200.62 కోట్లు ఖర్చయ్యిందని అన్నారు.మెత్తం మీద అన్ని రకాలుగా ఇళ్లపట్టాల రూపేణా పేదలకు పంచిన భూములు 71,811.49 ఎకరాలకు,రూ.56,102.91 కోట్లు ఖర్చు చేశామన్నారు.పేదలంరికీ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం చేస్తున్న ఖర్చు, కార్యక్రమం విలువ మొత్తం రూ.1,05,886.61 కోట్లుని వెల్లడించారు.