Banakacharla Project: ఏపీలో మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు- మూడు నెలల్లో డీపీఆర్, టెండర్లు - హైబ్రీడ్ విధానంలో పనులు 

Andhra Pradesh News: మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జిలాలు పంపించి రాష్ట్రాన్ని కరవు రహితంగా మార్చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఈ ప్రాజెక్టు పూర్తి వివరాలను పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌తో వివరించారు.

Continues below advertisement

Telugu Talli Ki Jala Harati Project: గోదావరి జలాలను బనకచర్లకు తరలించి  తెలుగుతల్లికి జలహారతి ఇవ్వడం తన జీవితాశయమని, ఇది పూర్తైతే ఏపీకి గేమ్ ఛేంబర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. చరిత్ర తిరగరాసే ఈ ప్రాజెక్టు పూర్తైతే ఏపీలో కరవు మాటే వినబడదన్నారు. నదుల అనుసంధానంతో భవిష్యత్‌లో నీటి సమస్య ఉండదని చెప్పారు. గోదావరి జలాలను బనకచర్లకు తరలించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. 

Continues below advertisement

పవర్ పాయింట్‌ ప్రజంటేషన్ ఇచ్చిన సీఎం మాట్లాడుతూ... స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్‌లో పది సూత్రాల్లో నీటి భద్రతకు ప్రాధాన్యత ఇచ్చామని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యేకే సీమకు నీళ్లు ఇచ్చామని తెలిపారు. ఇందిరాగాంధీ సమక్షంలో జరిగిన ఒప్పందం టైంలో శ్రీశైలం నుంచి తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తమిళనాడుకు కెనాల్ నీరివ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినట్టు గుర్తు చేశారు. అలా రాయలసీమ, తమిళనాడుకు నీరిచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. 

90 శాతం ప్రాజెక్టులు ఘనత టీడీపీదే
ఉమ్మడి రాష్ట్రంలో 90 శాతం ప్రాజెక్టులు టీడీపీ పూర్తి చేసినవేనన్నారు చంద్రబాబు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చెప్పినా తెలంగాణలోని 7 మండలాలు ిస్తేనే ప్రమాణస్వీకారం చేస్తానని ప్రధాని మోదీకి చెప్పినట్టు పునరుద్ఘాటించారు. ఆర్డినెన్స్ తెచ్చాకే ప్రమాణం చేసినట్టు వెల్లడించారు. నీటి విషయంలో ముందుచూపుతో వెలుగొండ ప్రాజెక్టు పునాది రాయి వేసినట్టు వెల్లడించారు. ఉత్తరాంధ్రలో తోటపల్లి పూర్తిచేశామన్నారు. 3 వేల టీఎంసీల గోదావరి నీరు సముద్రంలోకి వృథాగా పోతోందన్నారు చంద్రబాబు. అందులో 300 టీఎంసీల నీటిని ఒడిసిపట్టడమే ఈ కొత్త ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమన్నారు. ఇది పూర్తైతే 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు. 

మూడు దశల్లో బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు చంద్రబాబు. పోలవరం నుంచి కృష్ణా నదికి నీరు మళ్లించడం మొదటి దశ, బొల్లాపల్లి జలాశయం నిర్మించి నీళ్లు తరలించడం రెండో దశ.  బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్లకు నీరు మళ్లించడం మూడో దశగా చెప్పుకొచ్చారు. గోదావరి నీటిని కృష్ణా నది ద్వారా నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్‌కు అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు  తరలిస్తామన్నారు. పెన్నా నది ద్వారా నెల్లూరుకు నీరు ఇవ్వొచ్చన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లాలో కరవును అరికట్టవచ్చని తెలిపారు. 

ఇంకా చంద్రబాబు ఏమన్నారంటే "ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో నీరు లేక సాగు దెబ్బతింది. సకాలంలో నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమను రతనాలసీమగా మార్చవచ్చు. గతంలో అనంతపురంలో అతి తక్కువ తలసరి ఆదాయం ఉన్నా... ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడంతో తలసరి ఆదాయం 4-5 శాతానికి చేరింది. పట్టిసీమ రాకతో సకాలంలో పంట చేతికి అందుతోంది. ఈసారి వరుణుడు కరుణించాడు. ప్రభుత్వ యంత్రాంగం పని తీరుతో అన్ని రిజర్వాయర్లలో 983 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం రిజర్వాయర్ల నీటి సామర్థ్యం 729 టీఎంసీలుగా. జనవరికి రిజర్వాయర్లలో 74 శాతం నీరు ఉండటం ఒక చరిత్ర. వర్షపు నీటిని సకాలంలో రిజర్వాయర్లకు పంపి నిల్వ చేయగలిగాం. నదుల అనుసంధానం చేసి రిజర్వాయర్లు కడితే నీటి సమస్య అనేదే ఉండదు.

గత పాలకుల నిర్ణయాలతో తీరని నష్టం జరిగింది. వ్యవస్థలను పునరుద్ధరిస్తున్నాము. భావితరాలకు ఉపయోగపడే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ప్రజల్లో చర్చ జరగాలి. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు హైబ్రీడ్ విధానంలో ప్రైవేటు పార్టనర్ షిప్‌ను చేర్చే అంశాన్ని ఆలోచిస్తున్నాం. ఇప్పటికే ప్రాజెక్టు గురించి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించాను. డీపీఆర్ పూర్తి చేసి 2-3 నెలల్లో టెండర్లు పిలుస్తాం. సకాలంలో నిధులు అందితే మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది." అని చంద్రబాబు వివరించారు. 

Continues below advertisement