Chandrababu Naidu: ప్రమాణం చేసిన తర్వాత ప్రధానిని కౌగిలించుకొని చంద్రబాబు ఎమోషన్- కార్యక్రమానికి తరలి వచ్చిన రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు
Chandrababu Naidu Oath: నభూతో నభవిష్యతి అన్నట్టు సాగుతోంది చంద్రబాబు ప్రమాణస్వీకారమహోత్సవం. ఢిల్లీ నుంచి గల్లీ వరకు నేతలంతా హాజరై కొత్త ప్రభుత్వాని దీవిస్తున్నారు. ప్రజలకు మంచి చేయాలని ఆకాంక్షించారు.
Chandrababu Naidu Oath Ceremony : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవంలో అంతా పాల్గొన్నారు. కొందరు వీఐపీ గ్యాలరీలో కూర్చోగా.. మరికొందరికి వేదికపై చోటు కల్పించారు. రాజకీయ సినీ, వ్యాపార ఇతర రంగాల ప్రముఖులతో ఈ వేడుక కనులవిందుగా మారింది. గతంలో ఏ సీఎం ప్రమాణ స్వీకారానికి రాని హైప్ వచ్చిందనే ప్రచారం నడుస్తోంది.
ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. అనంతరం 11.15 నిమిషాలకు ప్రమాణ స్వీకారం జరిగే వేదికపైకి వచ్చిన ప్రధానమంత్రి కార్యక్రమం పూర్తయ్యే వరకు ఉన్నారు.. చంద్రబాబు ప్రమాణం చేసిన తర్వాత ఆయనకు ప్రధానమంత్రి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా మోదీని కౌగిలించుకున్న చంద్రబాబు చాలా ఎమోషన్ అయ్యారు.
ముందురోజే వచ్చిన అతిథులు...
ప్రమాణ స్వీకారానికి వచ్చిన అతిథులు చాలా మంది ముందు రోజే విజయవాడ చేరుకున్నారు. దీంతో ప్రమాణ స్వీకారానికి 24 గంటల ముందు నుంచే విజయవాడలో ఉత్సవ వాతావరణం నెలకొంది. హోటల్స్ కిక్కిరిసిపోయాయి.
ముందురోజు విజయవాడ చేరుకున్న హోంమంత్రి అమిత్‌షాకు చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఫ్యామిలీ మెంబర్స్‌తో కాసేపు మాట్లాడు. ఆయన వచ్చిన కాసేపటికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విజయవాడ చేరుకున్నారు. ఆయనకు నారా లోకేష్ స్వాగతం పలికారు.
ఒకే వేదికపై బాలకృష్ణ, చిరంజీవి, రజనీకాంత్
వేదికపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. వేదికపైకి వస్తున్న అతిథులను ప్రత్యేకంగా ఆహ్వానించి వారికి కేటాయించిన సీట్లలో కూర్చోబెట్టారు. మెగాస్టార్ చిరంజీవిని ఆత్మీయంగా పలకరించారు.
అనంతరం వచ్చిన రజనీకాంత్‌ను కూడా ఆహ్వానించి ఆయనతో కాసేపు మాట్లాడారు.