Big Shock For Gannavaram former MLA Vallabhaneni Vamsi: గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ఫిర్యాదుదారుడిని బెదిరించారన్న ఆరోపణలతో అరెస్టు అయిన వైసీపీ లీడర్ వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. అసలు కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో ఆయన 71వ నిందితుడిగా ఉన్నారు. 


ప్రస్తుతం వల్లభనేని వంశీ విజయవాడ జైల్లో ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి విషయంలో ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ అనే వ్యక్తిని బెదిరించిన కేసులో అరెస్టు అయ్యారు. సత్యవర్థన్ సోదరుడు ఫిర్యాదుతో ఎస్సీ స్టీ కేసు పెట్టిన పోలీసులు ఆయన్న వారం రోజుల క్రితం అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో కూడా బెయిల్ కోసం వంశీ ప్రయత్నాలు చేస్తున్నారు. 


అదే టైంలో గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు వంశీ అభ్యర్థన తిరస్కరించింది. ఏదైనా ఉంటే విజయవాడ ఎస్సీఎస్టీ కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది.