Vijayawada Durga Temple | విజయవాడ: విజయవాడ దుర్గమ్మ ఆలయంలో 8 కీలక ఫైళ్లు మాయం కావడం కలకలం రేపుతోంది. ఆలయ ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ దీనిపై ఉద్యోగులను వివరణ అడిగినట్లు తెలుస్తోంది. ఫైళ్ల మాయంపై అధికారులు సరైన సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం. న్యాయం చేయాలంటూ కోర్టుకు వెళ్లిన ఉద్యోగుల సర్వీసు సంబంధిత ఫైళ్లు కనిపించకపోవడంతో ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. హెడ్ ఆఫీస్ నుంచి మొత్తం ఫైళ్లను తెప్పించి కోర్టులో కౌంటర్ వేయడానికి ఈవో చర్యలు తీసుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Vijayawada News: విజయవాడ దుర్గమ్మ ఆలయంలో 8 కీలక ఫైళ్లు మాయం, వివరణ అడిగితే నీళ్లు నమిలిన ఉద్యోగులు
Shankar Dukanam Updated at: 02 Mar 2025 01:36 PM (IST)
Vijayawada News: విజయవాడ దుర్గమ్మ ఆలయంలో 8 కీలక ఫైళ్లు మాయం, వివరణ అడిగితే నీళ్లు నమిలిన ఉద్యోగులు