AP Tahasildars Transfers : అసెంబ్లీ (Assembly) ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు (Parliament Electons) సమీపిస్తున్న వేళ... ప్రభుత్వం బదిలీల ప్రక్రియను వేగవంతం చేసింది. రెండ్రోజుల క్రితం భారీగా ఐఏఎస్ బదిలీ చేసిన సర్కార్... రికార్డు స్థాయిలో 710 మంది తహసీల్దార్లకు స్థానచలనం కల్పించింది. మొత్తం 710 మంది ఎమ్మార్వోలు బదిలీ అయ్యారు. జోన్-1లో 137 మంది, జోన్-2లో 170, జోన్-3లో 154, జోన్-4లో 249 మంది ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ సీసీఎల్‌ఏ ఉత్తర్వులు జారీ చేసింది.
ఐపీఎస్‌ల పోస్టింగ్‌లు, బదిలీల్లో మార్పులు
8 మంది సీనియర్ ఐపీఎస్‌ల పోస్టింగ్‌లు, బదిలీల్లో మార్పులు చేసింది. శాంతిభద్రతల అదనపు డీజీగా శంఖబ్రత బాగ్చీ, విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో శాంతిభధ్రతల డీసీపీగా కృష్ణకాంత్, సీఐడీ ఎస్పీగా గంగాధర్‌రావును నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆనందరెడ్డి ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ అయ్యారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్ రాజశేఖర్‌బాబుకు కోస్టల్ సెక్యూరిటీ ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. మంగళగిరి ఆరో బెటాలియన్ కమాండెంట్‌గా వి.రత్న, అనంతపురం 14వ బెటాలియన్ కమాండెంట్‌గా అమిత్ బర్దార్ నియమితులయ్యారు. కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్‌కు కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
30 మంది ఐపీస్ లు బదిలీ
రెండ్రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ లు బదిలీ చేసింది ప్రభుత్వం. రైల్వే పోలీస్ అదనపు డీజీగా కుమార్ విశ్వజిత్ ను నియమించింది. ఎస్ఎల్పీఆర్బీ ఛైర్మన్ గా ఉన్న అతుల్ సింగ్...ఏపీఎస్పీ అడిషనల్ డీజీగా నియమించారు. సీఐడీ విభాగం ఐజీగా ఉన్న సీహెచ్ శ్రీకాంత్...అక్టోపస్ కు బదిలీ అయ్యారు. రోడ్ సేఫ్టీ అథారిటీ ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఎస్వీ రాజశేఖర్ బాబును ఎస్ఎల్పీఆర్బీ ఛైర్మన్ గా ప్రభుత్వం బదిలీ చేసింది. హోం గార్డ్స్ ఐజీగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. ఇంటెలిజెన్స్ ఐజీ ఉన్న కొల్లి రఘురామిరెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఐజీగా నియమించింది. అంతేకాకుండా డ్రగ్స్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
సర్వశ్రేష్ట త్రిపాఠికి సీఐడీ బాధ్యతలు అప్పగించింది. విశాఖపట్నం డీఐజీ హరిక్రిష్ణను పోలీసుసిబ్బంది వ్యవహారాల ఐజీగా నియమించింది. టెక్నికల్ సర్వీసెస్ ఐజీగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. విశాఖపట్నం శాంతిభద్రతల డీసీపీగా సీహెచ్ మణికంఠ, ఏపీఎస్పీ ఐదో బెటాలియన్ కమాండెంట్ గా అధిరాజ్ సింగ్ రాణా, కాకినాడ మూడో బెటాలియన్ కమాండెంట్ గా క్రిష్ణకాంత్ పటేల్, గుంటూరు ఎస్పీగా తుషార్, జగ్గయ్యపేట డీసీపీగా కె శ్రీనివాసరావు, రంపచోడవరం ఏఎస్పీగా కె ధీరజ్, పాడేరు ఏఎస్పీగా ఏ జగదీశ్, విజయవాడ డీసీపీగా ఆనంద్ రెడ్డిలను నియమించింది.
బదిలీలు, పోస్టింగులపై మార్గదర్శకాలు జారీ
రెండు మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉన్నతాధికారుల బదిలీలు, పోస్టింగులపై మార్గదర్శకాలు గతంలోనే జారీ చేసింది. ఎన్నికలతో సంబంధమున్న అధికారులు సొంత జిల్లాలో ఉండకూడదని, దీర్ఘకాలంగా ఒకేచోట ఉన్నవారు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం...డెడ్ లైన్ చివరి రోజు 710 తహసీల్దార్లను బదిలీ చేసింది.