Sajjala Meets Balineni : ఏపీలో కొత్త కేబినెట్(Cabinet) లో స్థానం దక్కని పలువురు నేతలు అలిగిన సంగతి తెలిసిందే. వీళ్లలో మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి(Balineni Srinivas reddy), మేకతోటి సుచరిత(Mekathoti sucharitha) ముందు వరుసలో ఉన్నారు. బాలినేనిని బుజ్జగించేందుకు నిన్న సజ్జల(Sajjala) ఆయన ఇంటికి వెళ్లారు. అయినా ఫలితం లేకపోయాయి. సోమవారం కూడా బాలినేని బుజ్జగింపు పర్వం కొనసాగింది. కొత్త మంత్రుల జాబితాలో తన పేరు లేకపోవడంతో బాలినేని అసంతృప్తిగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. విజయవాడ(Vijayawada)లోని బాలినేని శ్రీనివాస్ రెడ్డి నివాసానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అప్పిరెడ్డిలు వచ్చారు. బాలినేనితో భేటీ అయ్యారు. ఆదివారం కొత్త మంత్రుల పేర్లు ప్రకటించినప్పటి నుంచి సజ్జల బాలినేనితో భేటీ అవ్వడం ఇది మూడోసారి. నిన్న మధ్యాహ్నం, రాత్రి శ్రీకాంత్‌రెడ్డి(Srikanth reddy)తో కలిసి సజ్జల, బాలినేనితో భేటీ అయ్యి బుజ్జగించారు. అయినా బాలినేని వైఖరిలో మార్పులేనట్లు తెలుస్తోంది. సజ్జల తాజా భేటీలో సీఎం జగన్ తో కలవాలని బాలినేనిని కోరారు. అందుకు బాలినేని అంగీకరించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్(CM Jagan) ను బాలినేని కలవనున్నారు. 


రాజీనామా చేసేందుకు సిద్ధమైన సుచరిత!


కొత్త కేబినెట్ లో మంత్రి పదవి దక్కకపోవడంతో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత(Mekathoti Sucharitha) అసంతృప్తిగా ఉన్నారు. ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా(Resign) చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆమె ప్రకటన చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఎమ్మెల్యే(Mla) పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. వైసీపీ కాకుండా ఎమ్మెల్యే పదవికి మాత్రమే సుచరిత రాజీనామా చేస్తున్నట్లు ఆమె కుమార్తె రిషిత ఆదివారం రాత్రి ప్రకటించారు. ఈ క్రమంలో ఇవాళ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మేకతోటి సుచరిత వెల్లడించారు. పార్టీలో మాత్రం కొనసాగుతానని వెల్లడించారు. వైసీపీలో ఇతర నేతల రాజీనామాలు చేయొద్దని, పార్టీకి నష్టం చేయొద్దని ఆమె కోరారు. ఇప్పటికే ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆమెకు మద్దతుగా పలువురు రాజీనామాలు చేశారు.


రోడ్డెక్కిన శ్రేణులు


వైసీపీలో జగన్ ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్లు  ! ఆయన మాటకు తిరుగులేదు. మంత్రి పదవుల్ని ప్రకటించే వరకూ ఇదే. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎక్కడ చూసినా అసంతృప్తే కనిపిస్తోంది. ప్రతి పార్టీలోనూ అసంతృప్తి సహజం. ఎందుకంటే  అన్ని అవకాశాలూ అందరికీ ఇవ్వలేరు. కానీ వాటిని ఆశించేవారు ఎక్కువ మందే ఉంటారు. అయితే వైఎస్ఆర్‌సీపీ పరిస్థితి వేరు. ఆ పార్టీలో అసంతృప్తి ఉన్నా  బయటపడుతుంది అని ఎవరూ అనుకోలేదు. రోడ్డెక్కుతారని.. రాజీనామాల వరకూ వెళ్తారని భావించలేదు. కానీ ఇక్కడ బాలినేనిశ్రీనివాస రెడ్డి, సుచరిత వంటివాళ్లు రాజీనామాలకు సిద్ధపడ్డారు. తమకు ఎమ్మెల్యే పదవులు కూడా వద్దంటున్నారు. చాలా చోట్ల నేతలు మీడియా ముందే కన్నీరు పెట్టుకున్నారు. తలుపుకుని వేసుకుని ఏడుస్తున్న వారి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి అభిమానులు. అనుచరులు రోడ్లపైకి వచ్చి చేస్తున్న రచ్చతో వారి అసంతృప్తి వెల్లువెత్తుతోంది.