Vijayasai Reddy In Rajya Sabha : ‘కాంగ్రెస్ పార్టీ ఏపీకి విలన్. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో  కచ్చితంగా చెప్పారు. కానీ   విభజన చట్టంలో ప్రత్యేక హోదాను చేర్చలేదని అందుకే హోదా రాలేదని విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఆరోపించారు.  విభజన చట్టంలో ప్రత్యేక హోదా చేర్చడంలో కాంగ్రెస్‌ ఫెయిల్ అయ్యింది. హోదాను చట్టంలో చేర్చడం కాంగ్రెస్‌కు  చేతగాక ఇప్పుడు మమ్మల్ని నిందిస్తున్నారని ారోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశమే లేదు. ఇప్పుడు దీన్ని ఒక ఎన్నికల అంశంగా మార్చాలని చూస్తున్నారు. ఏపీ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని  మండిపడ్డారు. -                                                   

  


రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై విజయసాయిరెడ్డి మాట్లాడారు.  కాంగ్రెస్ పార్టీ ఏపీకి కోలుకోలేని నష్టం చేసిందన్నారు విజయసాయిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరని చెప్పారు. రాహుల్ గాంధీ ఏ ఎన్నికల్లోనూ గెలవరని జోస్యం చెప్పారు విజయపాయిరెడ్డి. అంతేకాదు 2029 నాటికి కాంగ్రెస్ ముక్త్ భారత్ గా దేశం మారుతుందని చెప్పారాయన. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరిగింది. వైసీపీ తరపున చర్చలో పాల్గొన్నారు విజయసాయిరెడ్డి.  కాంగ్రెస్ ఉన్నంతకాలం దేశం వెనుకబాటుతో కుంగిపోయిందన్నారు.               


కాంగ్రెస్ పార్టీ ఏపీకి కోలుకోలేని నష్టం చేసింది. గత ఏపీ ఎన్నికల్లో నోటా కంటే  తక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఏపీకి చేసిన మోసానికి ఈ శిక్ష పడింది. ఇది సరిపోదు.. ఇంకా శిక్ష పడాలి. కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలనకు ఏపీ పెద్ద బాధిత రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అదృశ్యమైంది. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్‌ కనుమరుగు కావడం ఖాయం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 40 సీట్లకు మించి కాంగ్రెస్‌ గెలవదని మమతా బెనర్జీ అంటున్నారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.                    
 
2004లో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. పదేళ్ల తర్వాత చిట్టచివరిలో అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించారు. ఎన్నికల నోటిఫికేషన్ కు పది రోజుల ముందు రాష్ట్రాన్ని విభజించారు. ఎన్నికల్లో లాభం పొందాలని ఉద్దేశంతోనే ఇలా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అవకాశవాదంతో వ్యవహరించింది. కాంగ్రెస్ పార్టీ ఏపీకి విలన్. ఏపీ విభజనపై కాంగ్రెస్ పార్టీలోనే ఏకాభిప్రాయం లేదు. ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినందుకు కాంగ్రెస్ సిగ్గుతో తలదించుకోవాలి. ఏపీకి చేసిన మోసాలకు కాంగ్రెస్ కు తగిన శిక్ష పడాలి. కుటుంబం వ్యవహారంలో తలదూర్చడం కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్ కు ఉదాహరణ అనిచెప్పుకొచ్చారు.