Vidadala Rajani PAs and followers Corruption:  పల్నాడు జిల్లాలో ఉద్యోగాల పేరిట భారీ మోసం బయటపడింది. మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్  నేత విడదల రజని పీఏలు, అనుచరులపై దోర్నాలకు చెందిన బీ.ఫార్మసీ విద్యార్థి కృష్ణ ,  మరికొంతమంది బాధితులు పల్నాడు పోలీస్ సూపరింటెండెంట్ కి ఫిర్యాదు చేశారు. ఉద్యోగాలు ఇస్తామని విడదల రజని పీఏలు శ్రీకాంత్ రెడ్డి, దొడ్డా రామకృష్ణ ,  ఆమె ముఖ్య అనుచరులు శ్రీగణేశ్, అతని సోదరుడు కుమారస్వామి మొత్తం రూ.5 కోట్లు వసూలు చేశారని ఆరోపణలు చేశారు. డబ్బు తిరిగి ఇవ్వమని కోరితే బెదిరిస్తున్నారని  ఆరోపించారు.                

Continues below advertisement

పల్నాడు జిల్లా దోర్నాల మండలానికి చెందిన బీ.ఫార్మసీ విద్యార్థి కృష్ణ మరియు మరికొంతమంది యువకులు ఈ ఫిర్యాదు  చేశారు. వారి ప్రకారం, విడదల రజని అనుచరులు 2023-2024 మధ్య కాలంలో "ఉద్యోగాలు ఇస్తామని" హామీ ఇచ్చి, వివిధ రంగాల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు మొత్తం రూ.5 కోట్లు వసూలు చేశారు. ఈ మొత్తాన్ని "ఉద్యోగాల సిఫార్సు ఫీజు"గా చెప్పుకుని సేకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పట్లో విడదల రజనీ మంత్రిగా ఉన్నారు.                      

విడదల రజనీ పీఏలు శ్రీకాంత్ రెడ్డి, దొడ్డా రామకృష్ణలు మాజీ మంత్రి విడదల రజని పేరును ఉపయోగించుకుని మోసం చేశారని వారంటున్నారు.  శ్రీగణేశ్ ,  కుమారస్వామి  ముఖ్య అనుచరులు ఈ డబ్బును సేకరణలో కీలక పాత్ర పోషించారు. డబ్బు తిరిగి ఇవ్వమని డిమాండ్ చేస్తే, "మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, ఫిర్యాదు చేస్తే కష్టాలు తప్పవు" అంటూ బెదిరిస్తున్నారని బాధితులు చెబుతున్నారు.   

Continues below advertisement

విడదల రజని, వైకాపా పార్టీలో మాజీ మంత్రి.  2019లో చిలుకలూరిపేట నుంచి మొదటి సారి పోటీ చేసి గెలిచారు.  2024 ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేిస  ఓటమి తర్వాత  మళ్లీ చిలుకలూరిపేటకు వచ్చారు. ఆమెపై చాలా ఆరోపణలు వచ్చాయి.  ఆమె పేరును ఉపయోగించుకుని మోసాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. విడదల రజని ఈ ఆరోపణలపై ఇంకా స్పందించలేదు.  ఫిర్యాదు చేసిన వారి వద్ద ఉన్న ఆధారాలు.. ఇతర వివరాలను సేకరించి.. కేసు నమోదు చేసే అవకాశం ఉంది.  

విడదల రజనీకి తెలికుండా ఇంత పెద్దంలో వసూలు చేయరని.. ఆ డబ్బులన్నీ ఎవరికి చేరాయో విచారణ జరిపి తమ డబ్బులు తమకు ఇప్పించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. గతంలో విడదల రజనీపై అనేక ఆరోపణలు వచ్చాయి. కేసులుకూడా నమోదయ్యాయి. కానీ అరెస్టు మాత్రం చేయలేదు.