దేశంలో ఓ వైపు కరోనా వ్యాప్తి ఎక్కువైపోతుంది. ఈ నేపథ్యంలో టీటీడీ.. తిరుమలకు వచ్చే భక్తులకు ఓ నిబంధన విధించింది. శ్రీవారి దర్శనానికి వచ్చే.. భక్తులు రెండు డోసులు టీకా పొందినట్టు ధ్రుపత్రాన్ని, లేకపోతే.. 72 గంటల ముందు చేసిన ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టును తీసుకుని రావాలని పేర్కొంది.
భక్తులకు గుడ్ న్యూస్
కలియుగ వైకుంఠనాథుడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం కోసం పరితపించి పోతారు భక్తులు.. ఎన్నో వ్యయ ప్రయాసలకులోనై వివిధ మార్గాల ద్వారా తిరుమలకు చేరుకుంటారు. ఎలాగైనా శ్రీనివాసుడిని కన్నులారా చూడాలని వెయ్యి కళ్ళతో వేచి చూస్తుంటారు.. దీని కోసం భక్తులు ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖ కోసం భక్తులు చేయని ప్రయత్నాలు ఉండవు.. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ చివరి క్షణాల్లో సిఫార్సు లేఖలు దొరక్క పోవడంతో భక్తులు నిరాశకు గురి అవుతుంటారు.. ఎలాగైనా స్వామి వారి దివ్య మంగళ స్వారూపం దర్శించాలని కోరికతో దళారులను, ట్రావెల్ ఏజెన్సీలను భక్తులు ఆశ్రయిస్తున్నారు. ఇలా దళారులను ఆశ్రయించిన భక్తులు అధిక ధర చెల్లించి టిక్కెట్లు పొందుతున్నారు.
మరికొందరు ట్రావెల్ ఏజెన్సీ కి చేందిన వ్యక్తులు విమానాశ్రయం వద్ద భక్తులను నమ్మించి టిక్కెట్లను మార్పింగ్ చేసి భక్తుల వద్ద నుండి నగదు పొంది తప్పించుకుంటారు. తీరా టిక్కెట్లు పట్టుకుని వచ్చాక.. అవి మార్పింగ్ టిక్కెట్లు అని టీటీడీ సిబ్బంది తెలియజేయడంతో, తాము మోస పోయాంమని గ్రహించి టీటీడీ విజిలెన్స్ అధికారులను ఆశ్రయిస్తున్నారు.. ఇలాంటి దళారులను అరికట్టేందుకు టీటీడీ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. అక్టోబర్ 2019లో శ్రీవాణి (శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ) ట్రస్ట్ ను తెరపైకి తెచ్చింది. ఈ ట్రస్ట్ కు 10 వేల రూపాయలు విరాళం ఇవ్వడంద్వారా ఒక వ్యక్తికీ ప్రోటోకాల్ దర్శనం కేటాయిస్తోంది టీటీడీ..
మరోవైపు... రాయలసీమలోనే.. విమానాశ్రయం ఉండటంతో నిత్యం వివిధ రాష్ట్రాల నుంచి యాత్రికులు వస్తుంటారు. దీంతో యాత్రికుల తాకిడి రోజు రోజుకి కూడా బాగా పెరుగుతున్న దృష్ట్యా ఉద్ధాన్ (UDAN) పథకానికి తిరుపతిని ఎన్నుకున్నారు. ఈస్కీం ద్వారా పలు రాష్ట్రాల నుంచి ఎయిర్ వే కనెక్టవిటీ తిరుపతి విమానాశ్రయానికి చేరనున్నాయి. ఏపీ టూరిజం అధికారులు.., టీటీడీ అధికారులను ఆశ్రయించి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చెప్పట్టాలని విన్నవించినట్లు తెలుస్తోంది.
భక్తుల సౌకర్యార్థం విమానాశ్రయంలో శ్రీవాణి టిక్కెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలని టూరిజం అధికారులు విన్నవించారు. పలు దఫాలు ఈ అంశంపై టూరిజం శాఖా అధికారులతో చర్చించిన టీటీడీ ఉన్నతాధికారులు తీర్మానాన్ని పాలకమండలిలో ప్రవేశ పెట్టారు. దీనిపై పాలకమండలిలో చర్చించిన సభ్యులు., ఛైర్మన్ పూర్తి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. కరెంట్ బుకింగ్ కౌంటర్ ను ఏర్పాటు చేసే విషయంపై ఎయిర్ పోర్ట్ అథారిటీతో చర్చించి తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే గతేడాది డిసెంబర్ నాల్గో తేదీనే విమానాశ్రయంలో శ్రీవాణి ట్రస్ట్ కౌంటర్ ఏర్పాటుకు ఆర్డర్ కాపీ విడుదల చేసింది.
Also Read: AP PRC Issue: జగన్ సర్కార్ కు మరో షాక్... ట్రెజరీ ఉద్యోగుల సహాయ నిరాకరణ... జీతాల ప్రాసెస్ కు నో ...!