Two Children Died After Eating Panipuri: ఏలూరు (Eluru) జిల్లా జంగారెడ్డి గూడెంలో (Jangareddigudem) బుధవారం రాత్రి విషాదం జరిగింది. పానీపూరి (Panipuri) తిన్న ఇద్దరు అన్నదమ్ములు తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. అన్నదమ్ములు వెలపాటి రామకృష్ణ (10), వెలపాటి విజయ్ (6) రాత్రి పానీపూరి తినగా గురువారం తెల్లవారుజామున వాంతులు, విరోచనాలతో బాధ పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


'పానీపూరి తినడం వల్లే'


పానీపూరి తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయ్యి తమ బిడ్డలు చనిపోయారని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నంద్యాల జిల్లా వైఎస్సార్ కాలనీ నుంచి బతుకుదెరువు కోసం చిన్నారులతో కలిసి వీరు జంగారెడ్డిగూడేనికి వలస వచ్చారు. ఇక్కడ ప్లాస్టిక్ వ్యాపారం నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఊహించని రీతిలో చిన్నారులు మృత్యువాత పడడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.


Also Read: YS Jagan News: అప్పుడు ఏపీని, ఇప్పుడు మా కుటుంబాన్ని చీల్చి రాజకీయాలా? కాంగ్రెస్ పై సీఎం జగన్ విమర్శలు