వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల మధ్య ట్వీట్ వార్ వ్యక్తిగత దూషణల స్థాయికి వెళ్లిపోతోంది.  రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి .. రఘురామకృష్ణరాజును ఉద్దేశించి నాటు పదాలను ఉపయోగించి రోజు ఓ ట్వీట్ ఖచ్చితంగా పెడుతున్నారు. దానికి రఘురామకృష్ణరాజు కూడా అదే స్థాయిలో రిప్లయ్ ఇస్తున్నారు. దీంతో రోజూ వీరిద్దరి ట్వీట్లు నెటిజన్లకు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇద్దరూ ఒకే పార్టీకి చెందినప్పటికీ రఘురామకృష్ణరాజు కొంత కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో విభేదిస్తున్నారు. 


సంక్రాంతి పండుగ అయిపోయి చాలా రోజులైన తర్వాత హఠాత్తుగా కోడి పందాల ప్రస్తావన తీసుకు వచ్చి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి  .. రఘురామకృష్ణరాజుపై విమర్శలు గుప్పించారు. ఆయన  ఫారం కోడి అని.. టీడీపీ ట్యూన్లకు రికార్డింగ్ డాన్సులు వేస్తారని మండిపడ్డారు. 



Also Read: AP New Districts: ఏపీలో మరో 13 కొత్త జిల్లాలు... ఉగాదిలోపు అమల్లోకి వచ్చే అవకాశం... నేడో, రేపో నోటిఫికేషన్ విడుదల..!


దీనికి వెంటనే రఘురామకృష్ణరాజు కూడా కౌంటర్ ఇచ్చారు. కోడి కత్తిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తన మీద పోటీకి పందెం కోడిగా రావాలని ఈకలు పీకి పంపిస్తానని సవా‌ల్ చేశారు.  



నాలుగు రోజుల క్రితం రఘురామకృష్ణరాజుకు పాంటోఫోబియా అనే వ్యాధి ఉందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి చెప్పిన వ్యాధి లక్షణాలను పోస్ట్ చేసిన రఘురామ..అవన్నీ ఎవరికి ఉన్నాయో చూసుకోవాలని కౌంటర్ ఇచ్చినట్లుగా ట్వీట్ చేశారు 



అదే రోజు ఎవరి మెప్పు కోసం విప్పుకు తిరగడం వంటి పదాలతో విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తే.. కౌంటర్‌కు విశాఖ యువతుల మీద ప్రేమ బాణాలు విసురుతున్నావని రఘురామ కౌంటర్ఇచ్చారు. వీరిద్దరి ట్వీట్లు.. నెటిజన్లలో పలు రకాల చర్చలు.. అనుమానాలకు కారణం అయ్యాయి. 



 Also Read: Also Read: మహేష్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌‌పై సైబర్ అటాక్.. ప్లాన్ ప్రకారం ఖాతాలు తెరిచి రూ.12 కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్లు


ఇలా ఇద్దరు అధికార పార్టీ ఎంపీలు ఇలా సోషల్ మీడియాలో తిట్టుకోవడం హాట్ టాపిక్‌గా మారుతోంది. వీరిని కంట్రోల్ చేయడానికి వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ కూడా ప్రయత్నించడం లేదు . దీంతో ఎంపీల భాష ఇలా ఉంటుందేంటి అని నెటిజన్లు కూడా ఆశ్చర్యపోవాల్సిన పరస్థితి ఏర్పడింది. 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి