Breaking News Telugu Live Updates: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, సెప్టెంబర్ 27న ప్రారంభం
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
ABP Desam Last Updated: 01 Jul 2022 04:05 PM
Background
తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2022) ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. టెట్ 2022 నిర్వహణకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా షెడ్యూల్ ప్రకారమే టెట్ నిర్వహించింది. రైల్వే రిక్రూట్ మెంట్ ఎగ్జామ్ (RRB) అదే...More
తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2022) ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. టెట్ 2022 నిర్వహణకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా షెడ్యూల్ ప్రకారమే టెట్ నిర్వహించింది. రైల్వే రిక్రూట్ మెంట్ ఎగ్జామ్ (RRB) అదే రోజున ఉందని పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు కోరినా విద్యాశాఖ మాత్రం నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ క్రమంలో జూన్ 12న టెట్ నిర్వహించారు. నోటిఫికేషన్ ప్రకారం చూస్తే.. తెలంగాణ టెట్ 2022 ఫలితాలు జూన్ 27న విడుదల కావాల్సి ఉంది. కానీ టెట్ ఫలితాలు జూలై 1కి వాయిదా వేశారు. టీచర్ పోస్టుల కోసం ఎదరుచూస్తున్న అభ్యర్థులు టెట్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.నైరుతి రుతుపవనాల తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో విస్తరించడంతో పలు జిల్లాల్లో గురువారం తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఏపీలోని కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుల సూచన ఉంది. వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో పాటు యానాంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. జిల్లాల్లోని కొన్ని చోట్ల మాత్రం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు అధికంగా ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కర్నూలు, నంద్యాల జిల్లాలో వర్షాలు, విజయవాడలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో నేడు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌ను మేఘాలు కమ్మేశాయి. కానీ భారీ వర్ష సూచన లేదు. తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయి.బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు దిగొచ్చాయి. మరోవైపు వెండి ధర వరుసగా మూడో రోజు పతనమైంది. రూ.110 తగ్గడంతో తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,890కి పతనమైంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,650 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు నేడు హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.65,100 అయింది. కరీంనగర్, వరంగల్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,890, 22 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.47,650 అయింది. ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు తగ్గడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,890 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,650 గా ఉంది. విజయవాడలో స్వచ్ఛమైన వెండిపై రూ.200 తగ్గడంతో 1 కేజీ ధర రూ.65,100 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం, తిరుపతిలో రూ.200 మేర తగ్గడంతో నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,890 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,650 అయింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో రూ.200 తగ్గడంతో నేడు 1 కేజీ వెండి ధర రూ.65,100 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, సెప్టెంబర్ 27న ప్రారంభం
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 27వ తేదీ బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీన గరుడ సేవ, అక్టోబర్ 2 బంగారు రథం, అక్టోబర్ 4 మహా రథం, అక్టోబర్ 5న చక్రస్నానంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగిస్తాయని టీటీడీ తెలిపింది. సెప్టెంబర్ 27వ తేదీన సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారని, బ్రహ్మోత్సవాలు సమయంలో అన్ని ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేస్తామని తెలిపింది.