తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌పై మరోసారి తనదైన శైలిలో విమర్శలు చేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అందరూ అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. ప్రస్తుతం సీఎం దేశవ్యాప్త పర్యటనలో ఉన్నారని అన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతుల పోరాటంలో మృతి చెందిన రైతుల కుటుంబాలకు, గల్వాన్ లోయలో చైనా సైనికుల దాడిలో అమరులైన సైనికుల కుటుంబాలకు తెలంగాణ సర్కార్ ప్రకటించిన పరిహారాన్ని ఆదివారం పంజాబ్ వెళ్లి అందజేసిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ బాధితులకు పరిహారం అందజేస్తున్నట్లు వివిధ దినపత్రికల్లో వచ్చిన ఫొటోలను ట్వీట్‌కు జత చేశారు.
అయిన వారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అంటే ఇదేనేమో! అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఫాంహౌస్ గడప దాటి.. ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని కేసీఆర్ అననారు. పంజాబ్ రైతులకు పరిహారం ఇచ్చారని.. దాని మర్మమేమిటో మన రైతన్నలకు అర్థం కాదనుకుంటున్నారా.. అంటూ ట్వీట్ చేశారు.
అయిన వారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అంటే ఇదేనేమో! అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఫాంహౌస్ గడప దాటి.. ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించని కేసీఆర్.. పంజాబ్ రైతులకు పరిహారం ఇచ్చారని.. దని మర్మమేమిటో మన రైతన్నలకు అర్థం కాదనుకుంటున్నారా!..’ అంటూ ట్వీట్ చేశారు.
నిఖత్ జరీన్‌కు శుభాకాంక్షలు
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభినందించారు. ఆమెకు రూ.5 లక్షల నజరానా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్విటర్ ద్వారా ప్రకటించారు. నిజామాబాద్ (Nizamabad) నుంచి ఇస్తాంబుల్ వరకు జరీన్ ప్రయాణం ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని రేవంత్ అన్నారు. పీవీ సింధు, సైనా నెహ్వాల్, సానియా మీర్జాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పారితోషికం ఇచ్చినట్లు నిఖత్ జరీన్‌కు కూడా అందించాలని సీఎం కేసీఆర్ ను ఆయన కోరారు.