Andhra Pradesh Tourism News | విజయవాడ: ప్రపంచం మారిపోతోంది.  ప్రతీ రంగం లోనూ అధునాతన మార్పులు వచ్చేస్తున్నాయి. టూరిజం కూడా దానికి మినహాయింపు కాదు. టూరిస్టులు కూడా పర్యాటక రంగం లో మోడరన్ సౌకర్యాలు  కోరుకుంటున్నారు. దాన్ని గమనించే ఏపీ ప్రభుత్వం టూరిజం క్యారవాన్ బస్సులను తెరపైకి తెచ్చింది. స్వయంగా ఏపీ సీయం చంద్రబాబు నాయుడు వాటిని శుక్రవారం (జూన్ 27న) విజయవాడ లో ప్రారంభించారు.  ఇంతకూ ఆ బస్సుల్లోని స్పెషాలిటీ ఏంటో  ఇప్పుడు చూద్దాం. తాను పర్యటనల్లో హోటల్లో స్టే చేయనని, క్యారవాన్ బస్సుల్లోనే విశ్రాంతి తీసుకుంటానని చంద్రబాబు అన్నారు.

క్యారవాన్ బస్సులు - సౌకర్యాలకు పెట్టింది పేరు 

సింపుల్ గా చెప్పాలి అంటే  మొబైల్ హాలీడ్ వెహికల్స్ అన్నమాట. సెలవుల్లో సరదాగా టూరిస్ట్ ప్లేస్ లు చుట్టి వచ్చేయాలి అనుకునే ఫ్యామిలీస్ కి ఇవి బెస్ట్ అప్షన్. వీటిలో ప్రయాణం ప్లస్ బస రెండింటి అప్షన్ ఉంటుంది. చాలా టూరిస్ట్ ప్లేసుల్లో  స్టే కి సరైన సదుపాయాలు ఉండవు. అలాగే ప్రయాణాల్లో మహిళలు, చిన్న పిల్లలు వాష్ రూమ్ ల కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి సమస్యలకు ఈ కార్వాన్ బస్సులు బెస్ట్ ఆప్షన్..వీటిలో బెడ్లు, చిన్న కిచెన్ దానిలో స్టవ్, ఫ్రిడ్జి, వాష్ రూమ్, కుర్చీలు, టేబుల్, AC, వైఫై, టీవీ వంటి సౌకర్యాలు ఉంటాయి. దీన్ని కదిలే హోటల్ రూమ్ అని చెప్పుకోవచ్చు.

గవర్నమెంట్ ఎందుకు ఈ క్యారవాన్ బస్ టూరిజంపై దృష్టి పెడుతోంది అంటే..

1) ఏపీ లాంటి రాష్ట్రాల్లో నిజమైన ప్రకృతి అందాలను వీక్షించాలి అంటే అడవులు, కొండలు, బీచ్ లు లాంటి ఏరియాల్లోకి వెళ్ళాలి. అలాంటి చోట్ల  శాశ్వత టూరిజం ఏర్పాట్లు, హోటళ్లు  రెడీ చేయడం వల్ల అక్కడ ప్రకృతి దెబ్బ తినే అవకాశం ఉంటుంది.  అదే క్యారవాన్ ల తో ఆ ప్రాబ్లమ్ ఉండదు.

2) కోవిడ్ తర్వాత ఎక్కువమంది పర్యాటకులు సేఫ్టీ, ఫిజికల్ డిస్టెన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి వారు ఫ్యామిలీ సమేతం గా వెళ్ళడానికి ఈ రకం బస్సులు చాలా బెటర్.

3) స్థానిక ఉపాధి

క్యారవా న్ బస్సులు ప్రయాణించే మార్గల్లో స్థానికులు లోకల్ ఫుడ్, హ్యాండీ క్రాఫ్ట్స్ లాంటివి అమ్మడం, క్యారవాన్ పార్కింగ్ ఏర్పాటు లాంటి అవకాశాలు తో ఉపాధి పొందే చాన్సెస్ ఉన్నాయి.

4)అసలు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని అరుదైన  టూరిస్ట్ స్పాట్ లకు కూడా వీటిలో సేఫ్ గా  వెళ్లి వచ్చేయొచ్చు

ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో  రెడీ

ఈ క్యారవాన్ బస్సుల టూరిజాన్ని ఇప్పటికే కేరళ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాస్ట్రాలు ఎడాప్ట్ చేసుకున్నాయి. ఇప్పుడు వాటిలో  ఏపీ కూడా చేరింది.  విజయవాడ లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ క్యారవాన్ బస్సులను ప్రారంచించగా.. దీన్ని ఏపీ టూరిజం డెవలప్ మెంట్ లో  గేమ్ చేంజింగ్ ఈవెంట్ గా  ఏపీ టూరిజం మినిష్టర్ కందుల దుర్గేష్ అన్నారు. త్వరలోనే వీటి బుకింగ్, రేట్స్ లాంటి వివరాలపై స్పష్టత ఇవ్వనున్నారు