Will AP government take back the land given to Mumtaz Hotel in Alipiri:  ముంతాజ్ హోటల్స్ నిర్మాణంలో ఉంది అని శ్రీవారి భక్తులు తిరుమలపైకి వెళ్లే సమయంలో ఓ బోర్డు కనిపిస్తూ ఉంటుంది. అత్యంత లగ్జరీగా అలిపిరి వద్ద నిర్మిస్తున్న ఈ హోటల్ విషయంలో వేరే అభ్యంతరాలు ఏమీ లేవు కానీ పేరు మాత్రం వేరుగా ఉంది. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోంది. అందుకే కొత్త టీటీడీ బోర్జు శరవేగంగా స్పందించింది. ఆ స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని అంతకు ముందు ప్రపోజ్ చేసిన దేవలోకం ప్రాజెక్టు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.


వైసీపీ హయాంలో ముంతాజ్ హోటల్‌కు 20 ఎకరాలు 


టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు అంటూ అలిపిరిలో ఒబెరాయ్ గ్రూప్ హోటల్ నిర్మించాడానికి ఇరవై ఎకరాలను వైసీపీ ప్రభుత్వం కేటాయించింది. 90 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. లీజు మార్కెట్ విలువలో ఒక్క శాతంగా నిర్ణయించింది. ప్రతి ఏడాది ఐదు శాతం పెంచుతూ వెళ్తారు. భూమిని లీజుకు తీసుకున్న తర్వాత 250 కోట్ల పెట్టుబడితో హోటల్ నిర్మాణానికి ముంతాజ్ గ్రూప్ హోటల్స్ పనులు ప్రారంభించింది. పునాదులు పడ్డాయి. అయితే ముంతాజ్ హోటల్స్ ఏమిటని హిందూ భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హోటల్ పేరు ముంతాజ్ అని ఉంటుందో లేదో కానీ ఈ కంపెనీ ఒబెరాయ్ గ్రూప్ సబ్సిడరీ. 



Also Read: Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం




2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ స్థలాన్ని దేవలోకం అనే ప్రాజెక్టుకు కేటాయించారు. తిరుమలకు వెళ్లే  భక్తులు మరింత భక్తి తత్వంతో ఉండేలా అక్కడ ప్రసిద్ధ ఆలయాల నమూనాలు ఏర్పాటు చేయాలనుకున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేసిస్టార్ హోటల్‌కు కేటాయించారు.  పదిహేను వందల మందికి ఉద్యోగాలు వస్తాయని టూరిజం పాలసీలో భాగంగా ఇస్తున్నట్లుగా చెప్పారు. 



Also Read: Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!




టీటీడీ బోర్డు ఆ హోటల్ స్థలాన్ని వెనక్కి తీసుకుని మళ్లీ అక్కడ దేవలోకం ప్రాజెక్టును చేపట్టాలని కోరింది. ప్రభుత్వం ఆలోచనలు ఎలా ఉన్నాయో స్పష్టత లేదు. అయితే అక్కడ ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మాణం కొనసాగించే అవకాశం మాత్రం ఉండదని అధికారవర్గాలు చెబుతున్నాయి. తిరుమల,తిరుపతిలో ఎక్కడ చూసినా శ్రీవారి నామమే ఉంటుంది. ఇతర మతాల గుర్తులతో ఎలాంటి వ్యాపారాలు నడవవు. పైగా శ్రీవారి భక్తులతో వ్యాపారం నిర్వహించేందుకు కడుతున్నహోటల్ కు ముంతాజ్ అని పెడితే భక్తులు అంగీకరించరు. కనీసం బీబీ నాంచారామ్మ అని పెట్టినా అంగీకరిస్తారు. ఈ విషయంలో ప్రభుత్వం ఓబెరాయ్ గ్రూప్ తో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. అసలు ల్యాండ్ డీలే చాలా విచిత్రంగా ఉందని 90ఏళ్లకు లీజ్‌కు అదీ కూడా ల్యాండ్ విలువలో ఒక్క శాతానికే ఇవ్వడం ప్రభుత్వానికి ఎలా మేలు చేస్తుందని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.