TTD Arjitha Seva Quota Tickets Online | తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ ముఖ్యమైన సమాచారం అందించింది. భక్తుల సౌకర్యార్థం 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన వివిధ దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, గదుల కోటాను విడుదల చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జనవరి 19వ తేదీ నుండి వరుసగా వివిధ కేటగిరీల టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేనుందని భక్తులు గమనించాలని సూచించింది.

Continues below advertisement

జనవరి 19 నుంచి శ్రీవారి దర్శన, సేవల టికెట్లు

ముందుగా, సుప్రభాతం, తోమాల, అర్చన వంటి ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్ (Electronic Dip) కోసం జనవరి 19న ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. జనవరి 21వ తేదీ ఉదయం వరకు భక్తులు నమోదు చేసుకోవచ్చు. జనవరి 22న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ వంటి సేవలతో పాటు వర్చువల్ సేవల కోటాను విడుదల చేస్తారు. అలాగే, జనవరి 23న అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు మరియు వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక దర్శన టోకెన్లను ఆన్‌లైన్‌లో ఉంచనున్నారు.

Continues below advertisement

అత్యంత ఆదరణ ఉన్న రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జనవరి 24న ఉదయం 10 గంటలకు, తిరుమల మరియు తిరుపతిలో గదుల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. భక్తులు కేవలం టిటిడి అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in  ద్వారా మాత్రమే తమ టికెట్లను బుక్ చేసుకోవాలని శ్రీవారి భక్తులకు అధికారులు సూచించారు. 

శ్రీవారి దర్శనం, సేవలు ఏప్రిల్ కోటా విడుదల వివరాలు

తేదీ సమయం కోటా వివరాలు
జనవరి 19 ఉదయం 10:00 ఆర్జిత సేవలు (లక్కీ డిప్ నమోదు ప్రారంభం)
జనవరి 22 ఉదయం 10:00 కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం
జనవరి 22 మధ్యాహ్నం 3:00 వర్చువల్ సేవలు మరియు దర్శన స్లాట్లు
జనవరి 23 ఉదయం 10:00 అంగ ప్రదక్షిణ టోకెన్లు
జనవరి 23 మధ్యాహ్నం 3:00 వృద్ధులు మరియు దివ్యాంగుల కోటా
జనవరి 24 ఉదయం 10:00 ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 300/-)
జనవరి 24 మధ్యాహ్నం 3:00 తిరుమల, తిరుపతిలో వసతి గదులు
జనవరి 27 మధ్యాహ్నం 3:00 శ్రీవారి సేవ మరియు పరకామణి సేవ (మార్చి నెల కోసం)