TTD Seva Tickets: తిరుమ‌ల శ్రీ‌వారి భ‌క్తులకు టీటీడీ శుభవార్త అందించింది. 2024 మార్చి నెల‌కు సంబంధించి శ్రీవారి ద‌ర్శ‌నం, ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది. 


శ్రీవారి భక్తులు డిసెంబ‌రు 18వ తేదీ ఉద‌యం 10 నుంచి 20వ తేదీ ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల‌ ల‌క్కీడిప్ కోసం న‌మోదు చేసుకోవాలని సూచించారు. డిసెంబ‌రు 21వ తేదీ ఉద‌యం 10 గంట‌లకు శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌ దీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుద‌ల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. 


డిసెంబ‌రు 21వ తేదీ ఉద‌యం 10 గంట‌లకు శ్రీ‌వారి తెప్పోత్స‌వాల టికెట్లను భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతారు. డిసెంబ‌రు 21న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ్రీ‌వారి వ‌ర్చువ‌ల్ సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్లు, ద‌ర్శ‌న టికెట్ల‌ కోటా విడుద‌ల కానుంది. డిసెంబ‌రు 23న‌ ఉద‌యం 10 గంట‌లకు అంగ‌ప్ర‌ద‌క్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి.


డిసెంబ‌రు 23న ఉద‌యం 11 గంట‌లకు శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల ద‌ర్శ‌నం, గ‌దుల కోటా విడుద‌ల చేయనుంది టీటీడీ. డిసెంబ‌రు 23న మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వృద్ధులు, దివ్యాంగుల ద‌ర్శ‌న‌టికెట్ల కోటాను విడుద‌ల చేస్తారు. డిసెంబ‌రు 25న ఉద‌యం 10 గంట‌లకు రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న ట‌కెట్ల‌ను భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతారు. డిసెంబ‌రు 25న మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు తిరుమ‌ల‌, తిరుప‌తిలోని గ‌దుల కోటాను టీటీడీ విడుద‌ల చేయనుంది. డిసెంబ‌రు 27న ఉద‌యం 11 గంట‌లకు తిరుమ‌ల‌, తిరుప‌తిలోని శ్రీ‌వారి సేవ కోటాను, అదేరోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు న‌వ‌నీత సేవ కోటాను, మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప‌ర‌కామ‌ణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని సూచించారు.