TTD needs to take initiative to solve the water problem in Tirupati: తిరుమల శేషాచలం అనేక జీవరాశులకు నెలవు. కోట్లాది వింత జీవరాశులు ఈ శేషాచలం లో మనకు దర్శనం ఇస్తాయి. తిరుమల యాత్ర కు వచ్చే వారికి శేషాచలం కొండలు ఒక కొత్త అనుభవాన్ని.. ఆహ్లాదాన్ని పెంచేలా ఉంటాయి. ఇలాంటి శేషాచలం కొండల్లో నుంచి చినుకు చినుక వర్గంగా మారి భారీ జలపాతాలు మనకు కనిపించడం అరుదు. జలపాతాల అందాలు కాదు నీటి వృథా పై ఎవరు దృష్టి సారించడం లేదు.
తిరుపతి ప్రజలకు దీర్ఘ కాలంగా నీటి ఎద్దడి
తిరుపతి దాహం తీరాలంటే వర్షాభావం పై ఆధారపడి ఉంటుంది. తిరుపతి సమీపంలోని ఒకనాటి సుమారు 12 చెరువులు నేడు 4 లేక 5 మాత్రమే అవి కూడా ఆక్రమణలు నుంచి తప్పించుకుని బయట పడ్డాయి. పూర్వం ఉన్న చెరువుల కారణం గా తిరుపతి జనాభా సైతం తక్కువ ఉండడం తో నీటి వనరు బాగా ఉండేది రానురాను కాంక్రీట్ జంగిల్ గా రోడ్లు.. కాలువలు రావడం అభివృద్ధి బాటలో చెరువులు ఆక్రమణలు అవ్వడం తో పాటు నీరు భూమిలోకి ఇంకకపోవడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయాయి. కొండ ప్రాంతం కావడంతో ఉన్న మేరకు నీరు లభిస్తుంది. అయితే జనాభా కు తగిన విధంగా మాత్రం తిరుపతి నగరంలో నీరు లేదని చెపొచ్చు.
జనాభా నీటి అవసరాలు తీర్చలేకపోతున్న ప్రస్తుత వనరులు
తిరుపతి కి సమీపంలోని బాలాజీ రిజర్వాయర్, మల్లెమడుగు, కళ్యాణి డ్యామ్ నీటిని అవసరాల మేరకు తీసుకుంటారు. ముఖ్యంగా తెలుగు గంగ నీటిని తిరుపతి లోని ప్రతి ఇంటికి వెళ్తుంది. వర్షాకాలం వర్షాలు పడితే తప్ప నీటి సమస్య ఉండదు. అది కూడా భారీ వర్షాలు కురిస్తే తప్ప నీటి సమస్య తీరదు. కరువు ప్రాంతమైన రాయలసీమ లో రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి భారీ వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాలు పడిన ఏడాది వరకు బాగున్నా మళ్లీ నీటి సమస్య ప్రారంభమయ్యే ప్రమాదం ఉంది.
సమస్యకు పరిష్కారం లేదా ?
తిరుపతి ప్రజల సుమారు 3.5 లక్లల కాగా ప్రతినిత్యం వచ్చే భక్తుల సుమారు 80 వేలకు పైగా ఉంటారు. ఇంతమంది కి సరిపడ నీరు కావాలంటే పెద్ద యుద్దం అని చెప్పాలి. తిరుమల శేషాచలం కొండలు నుంచి జాలువారే వేల క్యూసెక్కుల నీరు వృథాగా కాలువల ద్వారా ప్రవహిస్తూ స్వర్ణముఖి నదిలో కలిసిపోతుంది. మాల్వాడిగుండం, కపిలతీర్థం నుంచి వృథా అవుతున్న నీటిని అరికట్టే దిశగా చర్యలు తీసుకుని నీరు వృథాగా పోకుండా రిజర్వాయర్లు కడితే తిరుపతి లో భూగర్భ జలాలు పెరగడం తో పాటు తిరుమల, తిరుపతి కి నీటి సమస్య వచ్చే అవకాశం ఉండదు. ఈ డిమాండ్ సంవత్సరాల తరబడి ఉన్న నాయకులు, అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదనేది వాస్తవం.
టీటీడీ చొరవ తీసుకోవాలని స్థానికుల సూచనలు
శేషాచలం నుంచి వృథా అవుతున్న నీటిని టీటీడీ చొరవ తీసుకుని ప్రాజెక్టు లు కట్టాలి. నీటి వృథా ను అరికడితే భూగర్భ జలాలు పెరగడం తో పాటు టీటీడీ కి నీటి సమస్య తీరే మార్గం ఉంది. టీటీడీ ఛైర్మన్, బోర్డు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలి.