TIRUMALA MEWS: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబ‌రు 4 నుంచి జరగనున్నాయి. అక్టోబర్‌ 12వ తేదీ వరకు భక్తుల సౌకర్యార్థం టిటిడిలోని వివిధ‌ ట్రస్టులకు, ప‌థ‌కాల‌కు విరాళాలు అందించిన దాతలకు కేటాయించే గదులను టిటిడి రద్దు చేసింది. అక్టోబరు 4న ధ్వజారోహణం, అక్టోబర్ 12న చక్రస్నానం జరిగే రోజుల్లో మినహా మిగతా రోజులలో దాతలను దర్శనానికి అనుమతిస్తారు. 


ఈ వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా ఎక్కువ సంఖ్యలో యాత్రికులు వస్తున్నందున వారి సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు తొమ్మిది రోజుల పాటు కొన్ని ఆర్జిత సేవలు కూడా రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. 


నాటి తిరుమల సమాచారం
మొత్తం సర్వదర్శన టోకెన్స్‌: 27,500 
ఇప్పటి వరకు జారీ చేసినవి: 12,500
ఇంకా అందుబాటులో ఉన్నవి: 15,000


ఆగష్టు 29న వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ      
టీటీడీ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో ఒక సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (BC-B(W) -01, ST (W) - 01, BC-B -01, SC -01, BC-D(W)- 01 ) పోస్టులకో టీటీడీ ఇంటర్వ్యూలకు పిలిచింది. ఎంబిబిఎస్‌ విద్యార్హత గల అభ్యర్థులకు ఆగష్టు 29వ తేదీన వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. మొత్తం 5 పోస్టులు ఉన్నాయి.
తిరుపతి టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని సెంట్రల్ హాస్పిటల్‌లో ఉదయం 11 గంటలకు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ జ‌రుగ‌నుంది. ఆసక్తి గల అభ్యర్థులు త‌మ విద్యార్హతలు, అనుభ‌వానికి సంబంధించిన ధ్రువ‌ప‌త్రాల‌ ఒరిజినల్ , జిరాక్స్ ‌ కాపీలతో ఇంట‌ర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఇతర వివరాలకు www.tirumala.org వెబ్‌సైట్‌ను, కార్యాలయ పని వేళల్లో 0877-2264371 సంప్రదించగలరు.