Tirumala Drone : తిరుమలలో ఓ భక్తులు డ్రోన్ ఎగరేశాడు. అతన్ని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అన్షుమన్ తరెజా అనే యూట్యూబర్ తిరుమలకు వచ్చాడు. దర్శనం చేసుకున్న తర్వాత సాయంత్రం వేళలో డ్రోన్ ఎగరేశాడు. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న హరినామ సంకీర్తన మండపం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
అన్షుమన్ తరెజా డ్రోన్ ఎగరవేసిన ఘటన చూసిన అక్కడే ఉన్న టీటీడీ విజిలెన్స్ అధికారులు వారించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.