TTD EO AV Dharmareddy: తిరుమలలో సంచలనం రేపిన ఆనందం నిలయం ఫొటోలు, వీడియోలు తీసిన వ్యక్తిని టీటీడీ అధికారులు పట్టుకున్నారు. రాహుల్ రెడ్డి అన్నే భక్తుడు ఆనంద నిలయం వీడియో చిత్రికరించినట్లు టీటీడీ ఆలయ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. రాహుల్ ఉద్దేశ పూర్వకంగానే వీడియో చిత్రికరణ చేసినట్టు వివరించారు.


ప్రస్తుతం రాహుల్ రెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారని ఏవీ ధర్మారెడ్డి పేర్కొన్నారు. సెక్యూరిటీ వైఫల్యాన్ని తీవ్రంగా పరిగణించామన్నారు. ఈ క్రమంలోనే సీవీఎస్వో, వీజీవోతో పాటు భద్రతధికారులను మందలించామన్నారు. భద్రతా వైఫల్యానికి కారణమైన సెక్యూరిటీ సిబ్బందిని సస్పెండ్ చేస్తామన్నారు. శ్రీవారి ఆలయంలో పవర్ కట్ అయ్యే పరిస్థితి లేదని.. తిరుమల చరిత్రలో రెండు గంటల పాటు కరెంటు పొయిన పరిస్థితి లేదన్నారు. టీటీడీ తరుపున ఇలాంటి ప్రకటన ఎలా ఇచ్చారో తనకు తెలియడం లేదని చెప్పుకొచ్చారు. శ్రీవారి ఆలయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు పొయ్యే పరిస్థితి లేదన్నారు. 


లడ్డు నాణ్యతను మరింత పెంచుతాం..!


కాషన్ డిపాజిట్ రీఫండ్ కావడం లేదని భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఆలయ ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. వెను వెంటనే భక్తులకి కాషన్ డిపాజిట్ అందే విదంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పారిశుద్ద కార్మికులు సమ్మెకీ వెళ్లడంతో తిరుమలలో పారిశుద్ధ్య పనుల్లో కొంత లోపాలు కనిపిస్తున్నట్లు వివరించారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ముగిసిన తర్వాత తిరుమలని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్ననారు. అన్నదానంలో బియ్యం, లడ్డు నాణ్యత లోపించిందంటూ భక్తులు ఫిర్యాదు చేశారని అన్నారు. నాణ్యమైన బియ్యానే టీటీడీ వినియోగిస్తుందని.. లడ్డు నాణ్యతని మరింత పెంచుతామని హామీ ఇచ్చారు. రెండు ఘాట్ రోడ్లతో పాటు అలిపిరి, శ్రీవారి మెట్టు నడక దారుల్లో ఉద్యోగుల నేతృత్వంలో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్లాస్టిక్ రహిత తిరుమల కోసం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున్న నిర్వహిస్తున్నామన్నారు. 


మే 14 నుంచి 19 వరకు ఘనంగా హనుమ జయంతి వేడుకలు


నాలుగు ప్రాంతాలను 25 సెక్టార్లుగా విభజించి.. 600 మంది ఉద్యోగులను ఈ కార్యక్రమంలో భాగం చేసినట్లు వెల్లడించారు. మాజీ సీజే ఎన్వీ రమణ శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ప్రతి నెల రెండవ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఏప్రిల్ మాసంలో 20.95 లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా... హుండీ ద్వారా  రూ.114.14 లక్షల ఆదాయం లభించిందన్నారు. కోటి లక్ష లడ్డులను భక్తులకీ విక్రయించామని తెలిపారు. 42.64 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని... 9 లక్షల 3 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని స్పష్టం చేశారు. మే 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు హనుమ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. 


నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?


వేసవి సెలవులు, వారంతరం కావడంతో తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం (ఏప్రిల్ 11) రోజున 67,853 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 33,381 మంది తలనీలాలు సమర్పించగా.. రూ.3.19 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్ట్మెంట్లల్లో భక్తులు నిండి పోగా.. బయట టీబీసీ వరకూ భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో టైం స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.