TTD News: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా  బాలాలయం 


      ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో  బాలాలయం  ఆదివారం ఆగ‌మోక్తంగా  ప్రారంభం ఆయింది. ఇందులో భాగంగా ఆదివారం ఉద‌యం అగ్నిప్ర‌ణ‌య‌ణం, దారు (చక్క) విగ్రహాలు, కుంభారాధ‌న‌, అక‌ల్మ‌ష‌హోమం, మహా పూర్ణాహుతి నిర్వ‌హించారు. అనంతరం బాలాల‌య  మ‌హాశాంతిప్రోక్ష‌ణ నిర్వహించారు.


కడప జిల్లా లోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయం ప్రస్తుతం భారత పురావస్తు శాఖ పరిదిలో ఉంది. ఇకడ ఎం చేయాలి అన్న తపకుండా భారత పురావస్తు శాఖ అధికారులు, నిపుణులు పరిశీలన చేసి నివేదిక ప్రకారం అభివృధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటాది. ఆ మేరకు టిటిడి అధికారులు విన్నపం మేరకు భారత పురావస్తు శాఖ పరిశీలన చేసిన తరువాత ఆ కార్యక్రం  భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో గర్భాలయంలో  అభివృథుల నిమిత్తం   బాలాలయం నిర్వహించారు. ఇందుకోసం ఆలయ ప్రాంగణంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల దారు (చక్క) విగ్రహాలు ఏర్పాటు చేశారు.


సీత రామ లక్ష్మణులకు మహా సంప్రోక్షణ జరుగువరకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు. యాగశాలలో ఉదయం 9.30 నుంచి 10. 30 గంటల మధ్య తులా లగ్నంలో బాలాలయ సంప్రోక్షణ శాస్త్రక్తంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవోలు నటేశ్ బాబు,  ప్రశాంతి, సూపరిండెంట్  హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్,  ఆలయ అర్చకులు పాల్గొన్నారు.


 16 నుండి 18వ‌ తేదీ వరకు పవిత్రోత్సవాలు


తిరుమల శ్రీవారి దేవేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 16 నుండి 18వ‌ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరగనునాయి. ఆలయం లో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 10న ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం  నిర్వహించనున్నారు. ఆలయాన్ని పూర్తిగా శుది చేస్తారు. అనంతరం పవిత్ర మిశ్రమంతో ఆలయాన్ని ప్రోక్సనం చేస్తారు. ఆలయంలో  కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్బంగా ఆ సమయం లో అమ్మవారి దర్శనం నిలిపి వేస్తారు.


సెప్టెంబ‌రు 10న ఉదయం 7 నుండి 9.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టనున్నారు. ఈ కార‌ణంగా క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌ను ర‌ద్దు చేశారు. సెప్టెంబ‌రు 15న సాయంత్రం ప‌విత్రోత్స‌వాల‌కు అంకురార్పణ నిర్వ‌హిస్తారు. సెప్టెంబ‌రు 16న పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబరు 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 18న మహాపూర్ణాహుతి నిర్వ‌హిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లను టిటిడి విస్తృతంగా చేస్తుంది.