TTD AEO suspended:  టీటీడీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పని చేస్తున్న ఏ.రాజశేఖర్ బాబును  ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. తిరుపతి జిల్లా పుత్తూరులోని స్వగ్రామంలో రాజశేఖర్ బాబు ప్రతీ ఆదివారం స్థానిక చర్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి.  ఈ వ్యవహారంతో టీటీడీ ఉద్యోగిగా ఆయన  సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని భావించడమేకాక, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగి అయివుండి భాద్యతారహితంగా వ్యవహరించడం జరిగిందని టీడీపీ తేల్చిింది.  

ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ,  తక్షణమే సస్పెండ్ చేయడం జరిగిందని టీటీడీ ప్రకటించింది. 

ఇటీవల టీటీడీలో పని చేస్తూ అన్యమతాన్ని ఆచరిస్తున్న వారిని బయటకు పంపింది. కోరుకున్న వారికి వీఆర్ఎస్ లేకపోతే ఇతర సంస్థల్లోకి డిప్యూటేషన్ మీద పంపించారు.  2025 ఫిబ్రవరి 1న 18 మంది   క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నవారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఈ ఉద్యోగులు హిందూ సంప్రదాయాలను అనుసరిస్తామని ప్రమాణం చేసినప్పటికీ, అన్యమత కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు గుర్తించారు.  వీకంజకితీ బదిలీ లేదా వీఆర్ఎస్ అవకాశం ఇచ్చారు. వినియోగించుకోకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తారు.   టీటీడీలో పని చేసే ఉద్యోగులు ఖచ్చితంగా హిందూ మతాన్ని ఆచరించాలన్న నిబంధన ఉంది.   2007లో టీటీడీ నిర్వహించే లేదా ఆర్థికంగా సహాయపడే సంస్థలలో హిందువులను మాత్రమే నియమించాలని  నిర్ణయించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఒక హిందూ మత సంస్థగా ఉండాలని, అన్యమత ఉద్యోగులు దీనిలో పనిచేయకూడదని స్పష్టం చేస్తున్నారు.                          

టీటీడీలో పని చేస్తూ హిందువులుగా చెప్పుకుని చర్చిలకు వెళతున్న వారితోనే అసలు సమస్య వస్తోంది. తమ మతాన్ని అంగీకరించి.. టీటీడీలో కాకుండా డిప్యూటేషన్ పై ఇతర శాఖలకు వెళ్లేందుకు వారు ఆసక్తి చూపించడం లేదు. అదే సమయంలో.. తమ మత భావనను మార్చుకోవడం లేదు. హిందూ మతం కన్నా ఇతర మతాలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. వీరు.. తిరుమలలో.. అన్యమత ప్రచారానికి కారణం అవుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే టీటీడీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనుకుంటోంది. కానీ వీరిలో పెద్దగా ఎవరూ పట్టుబడటం లేదు. రాజశేఖర్ బాబు లాంటి వారిపై ఫిర్యాదులు వస్తేనే చర్యలు తీసుకుంటున్నారు.