Renigunta - Tiruchanur Railway Station: రేణిగుంట, తిరుచానూరు రైల్వే స్టేషన్ మధ్యలో ఉన్న CRS లో ఓ రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. తిరుపతి నుంచి రేణిగుంట వెళ్తున్న రైలుకి ఇచ్చిన సిగ్నల్ ను తనదిగా భావించిన లోకో పైలెట్ ఇంజిన్ ను ముందుకు కదిపారు. ఈ లోపు అసలు ట్రైన్ వస్తుండటంతో ట్రాక్ మార్చే ప్రయత్నంలో ఇంజిన్ పట్టాలు తప్పింది. పక్కనే బురదలోకి దిగిపోయింది రైలు ఇంజిన్. లోకో పైలెట్ సిగ్నల్ ను తప్పుగా అర్థం చేసుకోవటంతోనే ప్రమాదం జరిగిందని రైల్వే పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రమాదంలో లోకో పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. సంఘట స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది ఇంజన్ కు మరమ్మతులు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..
రేణిగుంట తిరుచానూరు రైల్వే స్టేషన్ మధ్య గల CRS లో అర్ధరాత్రి రైల్వే ట్రాక్ నుంచి ట్రైన్ ఇంజన్ అదుపుతప్పింది. తిరుపతి నుండి రేణిగుంట రైల్వే స్టేషన్ కి వెళ్తున్న ఓ రైలుకు సిగ్నల్ ఇవ్వడంతో తమ రైలు ఇంజన్ కి సిగ్నల్ ఇచ్చారని లోకో పైలెట్ ముందుకు నడిపారు. దాంతో లూప్ లైన్ లో నిలిచి ఉన్న ఇంజన్ ముందుకు వెళ్లగా, ప్రక్కన ఉన్న లైన్లో సిగ్నల్ రావడంతో అసలు రైలు అదే ట్రాక్ లో రావడంతో లోకో పైలట్ ఆందోళన చెందాడు. తమ ట్రాక్ సిగ్నల్ అనుకొని పొరపాటున ట్రైన్ ను ముందుకి నడపటంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రైన్ ఇంజన్ అదుపుతప్పి రెండు అడుగుల మేర బురద లోకి దిగబడింది. లోకో పైలట్ సురక్షితంగా ఉన్నాడని సమాచారం.
ఈ ప్రమాదంతో రైల్వే ట్రాక్ విరగడంతో ట్రైన్ ఇంజన్ బురదలోకి దూసుకెళ్లి నిలిచిపోయింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని రైలు ఇంజన్ కు మరమ్మతులు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రైన్ రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది కలకపోవడంతో రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్, నేడు 11 గంటల పాటు ఆలయం మూసివేత