Tirupati Train Accident: తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. బాలయపల్లి మండలంలోని జయంపు సమీపంలో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. గూడురు వైపు రైలు వెళ్తుండగా గేదెలు అడ్డురావడంతో ప్రమాదం జరిగింది రైలు బోగీలు పట్టాలు తప్పాయి. గూడ్సు రైలు ఢీకొనడంతో కొన్ని గేదెలు మృతిచెందాయని సమాచారం. ఈ ప్రమాదం సమాచారం తెలియడంతో రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. దాదాపు గంటన్నర సమయం తరువాత గూడ్స్ రైలు అక్కడి నుంచి కదిలింది.