Record Devotees have Darshan At Tirumala: తిరుపతి‌ : కలియుగ దైవం, చిత్తూరు జిల్లా తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి దర్శనార్ధం దేశ విదేశాల నుండి భక్తులు స్వామి వారి చెంతకు చేరుకుంటారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత రెండేళ్లుగా ఆంక్షలున్నాయి. కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో రెండేళ్ల తరువాత రికార్డు స్థాయిలో భక్తులు తిరుమలకు పోటెత్తారు. తిరుమలలో ఆంక్షలు సైతం ఎత్తివేయడంతో శనివారం నాడు శ్రీవారిని 75,775 మంది భక్తులు దర్శించుకోగా, గత రెండేళ్లలో ఇదే అత్యధికం.


కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భక్తులను కొండకు అనుమతిస్తోంది టీటీడీ. అయితే స్వామి వారి దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే కొండపైకి అనుమతించడంతో చాలా మంది సామాన్య భక్తులు స్వామి వారి సన్నిధికి చేరుకోలేకపోయారు.‌ తాజాగా కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో క్రమేపి దర్శన టోకెన్ల సంఖ్యను టీటీడీ పెంచడంతో భక్తులు స్వామి వారి దర్శనం కోసం భారీగా తరలి వస్తున్నారు. దీంతో తిరుమల కొండ రెండేళ్ల కిందటి లాగ భక్తులతో కిటకిట లాడుతోంది. ఎటు చూసినా భక్త సందోహంతో నిండిపోతుంది. వారంతపు సెలవులు కావడంతో స్వామి వారికి మొక్కులు చెల్లించేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. టీటీడీ యాత్రి సదన్, కల్యాణ కట్ట, అన్నదాన సత్రం, లడ్డూ వితరణ కేంద్రం, అఖిలాండం, ఇతర యాత్రా ప్రదేశాలు వంటి ప్రాంతాల్లో భక్తులతో నిండి పోతుంది. 


రికార్డు స్థాయిలో పోటెత్తిన భక్తులు..
తిరుమల శ్రీవారిని నిన్న ఒక్క రోజు 75,775 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్ారు. 36,474‌మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి హుండీ ద్వారా కానుకలుగా రూ.3.70‌కోట్లు టీటీడీకి ఆదాయం‌ లభించింది. భారీ సంఖ్యలో తరలిరావడంతో రూములు దొరక్క భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తుల ఇబ్బందులను టీటీడీ దృష్టిలో ఉంచుకొని రద్దీ ఉన్న ప్రాంతాల్లో పుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసి అల్పాహారంతో పాటు పాలు, మజ్జిగలను అందచేయాలని టీటీడీ నిర్ణయించింది. సమయ నిర్ధేశిత టోకెన్లు 24 గంటలు సమయం పడుతుంది. తిరుపతిలో టోకెన్లు భారీగా ఇస్తున్న క్రమంలో భక్తులు తిరుమల కొండకు చేరుకుని స్వామిని దర్శించుకునే అవకాశం కలిగింది.


దాదాపు రెండేళ్ల తర్వాత భారీ సంఖ్యలో భక్తులతో తిరుమల కిటకిటలాడింది. చాలా కాలం తరువాత గోవింద నామస్మరణలతో తిరుమల కొండ మారుమ్రోగింది. కొవిడ్‌19 ప్రభావం తగ్గుతుందని టీటీడీ ఇటీవల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటుగా, తిరుపతిలో ఆఫ్‌లైన్‌ ద్వారా ఇచ్చే టైంస్లాట్‌ సర్వదర్శనాల టోకెన్ల సంఖ్యను పెంచింది. రూ.300 దర్శన టికెట్లు 25 వేలు, సర్వదర్శన టోకెన్లు దాదాపు 40 వేలు ఇస్తుండంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. పైగా శని, ఆదివారాలు కావడంతో తిరుపతి అలిపిరి ప్రాంతంలో వాహనాలు బారులు తీరాయి. 8 లైన్లకు గాను రెండు ప్రాంతాల్లో ఉన్న 5 స్కానర్లలో  రెండు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  


తనిఖీలు అనంతరం తిరుమలకు వెళ్లేందుకు సుమారు గంటకు పైగా సమయం పడుతుండటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించి సకాలంలో భక్తులను తిరుమలకు అనుమతించాలని  భక్తులు కోరుతున్నారు. 


తిరుమలలో పాయల్ రాజ్‌పుత్.. 
తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి పాయల్ రాజ్ పుత్ దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ.. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, మంచు విష్ణుతో ఓ సినిమా చేస్తున్నానని, అంతే కాకుండా కన్నడ, తమిళంలో మరో రెండు సినిమాలు షూటింగ్ జరుగుతోందని తెలిపారు.


Also Read: Weather Updates: గత 5 ఏళ్ల కంటే ఈ ఏడాది ఎండల తీవ్రత అధికం - ఏపీ, తెలంగాణలో మొదలైన ఉక్కపోత


Also Read: Gold-Silver Price: బంగారం - వెండి ధరలపై ఇంకా యుద్ధం ఎఫెక్ట్! నేడు కూడా ఎగబాకిన ధరలు