తిరుపతి: ప్రజలు పోలీసులు తెలిపే నిబంధనలు పాటిస్తూ దొంగతనాల నివారణకు సహకరించాలని తిరుపతి పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ వారి వద్ద ఉన్న విలువైన వస్తువులు, నగదు, బంగారును అవసరమైనంత మేరకు మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలని సూచించారు. రెగ్యూలర్ గా అవసరం లేనివి బ్యాంకు లాకర్లో భద్రపరుచుకోవడం ఉత్తమమైన పద్దతి అని, బీరువాకు తాళం వేసిన తరువాత, తాళం చెవులు బీరువా పైన కానీ, బట్టల క్రింద కానీ, లేదా ప్రక్కన గోడకు తగిలించడం మాత్రం చేయవద్దని పోలీసులు హెచ్చరించారు.
బయటకు వెళ్లేటప్పుడు గాని లేదా ఇతర ఊర్లకు వెళ్ళేటప్పుడు గాని, ఇంట్లో, బయట కూడా లైట్ వేసి ఉంచాలని సూచించారు. ఇంటి ముందు తలుపులకు సెంటర్ లాక్ వేయాలని, ఇళ్లకు నాసిరకం తాళాలు వాడొద్దని, తాళం కనిపించకుండా కర్టన్స్ వేయాలని కోరారు. మీరు ఏదైనా ఇతర ఊర్లకు వెళ్లేటప్పుడు మీకు నమ్మకమైన వారికి, అలాగే స్థానిక పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇచ్చి వెళితే, పోలీసు వారు నైట్ బీట్ వారితో ఆ ప్రదేశములో గస్తీ నిర్వహించేలా చర్య తీసుకుంటున్నట్లు తెలిపారు.
వేరే ఊర్లకు వెళ్లినట్లెతే మీరు పక్క ఇంటి వాళ్లకు, మీ ఇంటి దగ్గరలో ఉండే మీకు ముఖ్యమైన బంధువులకు, అప్పుడప్పుడు ఫోన్ చేసి మీ ఇంటిని గమనిస్తూ ఉండమని చెబుతూ ఉండాలని, ఊరికి వెళ్ళినపుడు ఎవరో ఒకరిని కాపలా ఉంచాలని కోరారు.. స్త్రీలు బయటకు వెళ్లేటప్పుడు, వాకిట్లో ముగ్గులు వేసేటప్పుడు లేదా ఉదయం, సాయంత్రము వాకింగ్ కి వెళ్ళేటప్పుడు, మెడలోని బంగారు ఆభరణాలు కనిపించకుండా జాగ్రత్తగా కవర్ చేసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేశారు. తద్వారా చైన్ స్నాచింగ్ నేరములు జరగకుండా నివారించేందుకు వీలవుతుందన్నారు. మీ ఇంటికి నలువైపుల సిసీ కెమెరాలు సొంతంగా ఏర్పాటు చేసుకుని DVR/NVR ను రహస్య ప్రదేశాలలో భద్రపరుచుకోవాలన్నారు. మొబైల్ యాప్ ద్వారా సీసీ కెమెరా దృశ్యాలు మీరు ఎప్పటికప్పుడు వీక్షించే అవకాశం ఉంటుందన్నారు. మీ కాలనీలలో కమిటీలుగా ఏర్పడి, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే దొంగలు భయపడే అవకాశం ఉంటుందని, ప్రధాన రహదారులు కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలు అమర్చుకుంటే భద్రత కూడా ఎక్కువగా ఉంటుందన్నారు.
మీరు బస్సు లేదా రైలు ప్రయాణ సమయంలో ఆపరిచత వ్యక్తులు ఇచ్చిన తిను బండారాలు తీసుకోవద్దన్నారు. విలువైన వస్తువులు తీసుకెళ్తుంటే అటువంటి బ్యాగును మీ దగ్గరే భద్రంగా పెట్టుకోవాలని మర్చిపోవద్దని హెచ్చరించారు. మీ ప్రక్కనే కూర్చున్న వారు మిమ్మల్ని నమ్మించి లేదా మాటల్లో పెట్టి బ్యాగ్ లు కొట్టేసే గ్యాంగ్ లు ఎప్పుడు తిరుగుతూ ఉన్నాయన్న విషయం మరచిపోవద్దని ప్రజలను అలర్ట్ చేశారు. రద్దీ ఉన్న ప్రదేశాలలో, బస్సులు ఎక్కేటప్పుడు మీ సెల్ ఫోన్ లు, పర్స్‌ల మీద ఎప్పుడు దృష్టి ఉంచాలని, మీ ప్రక్కన ఉన్న ఆపరిచిత వ్యక్తులను ఎప్పుడు అనుమానాస్పదంగానే చూడాలన్నారు..
గతంలో ఎప్పుడు కూడా మా ఇంటిలో దొంగతనం జరుగలేదని లేదా మా కాలనీలలో అటువంటివి జరుగలేదు కాబట్టి, ఇక్కడ ఎప్పుడు దొంగతనాలు జరగవని భావించొద్దని, అటువంటి చోటే దొంగతనములు జరిగేందుకు అవకాశము ఉంటుందన్నారు. మీరు బయటికి వెళ్లే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయకండి. అలా షేర్ చేసినట్లైతే వారిని మీ ఇంటికి వచ్చి దోచుకుని వెళ్ళమని ఆహ్వానించినట్లే. ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ ప్రయాణ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయకుండ గోప్యముగా ఉంచే ప్రయత్నము చేయాలని కోరారు.
కాలనీలలో అనుమానాస్పాదముగా తిరిగే వారిని ప్రశ్నించి, వారి వివరాలు అడగండి, వారు. స్పందించనట్లైతే వెంటనే సమాచారమును DIAL100 నెంబర్ కు గాని, లేదా స్థానిక సీఐ, ఎస్ లకి తెలియజేయాలని కోరారు. అపరిచిత వ్యక్తులకు ATM కార్డ్ ఇచ్చి లావాదేవీలను చేయించరాదు, మోసపోయే అవకాశం ఉందని, తెలిసిన వారితో వెళ్లి క్యాష్ ట్రాన్షాక్షన్ చేసుకోవడం ఉత్తమమని సూచించారు. డబ్బు డ్రా చేసుకొని వెల్లునపుడు (Attention Diversion Groups) దృష్టి మరల్చి దొంగతనాలు చేసే అవకాశం ఉందని, టు వీలర్స్, ఫోర్ వీలెర్స్ లను అవకాశం ఉంటే ఇండ్లలో/ఇంటి ఆవరణలో తగు జాగ్రతలతో పార్కింగ్ చేసుకోవాలి. వీలైతే తమ వాహనాలకు GPS tracking ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ఇండ్లలోని కిటికీల వద్ద ఫోన్ లు గాని ల్యాప్టాప్ లు కానీ మరే ఇతర విలువైన వస్తువులు ఉంచరాదన్నారు. మీరు కుటుంబం తో సహా వేరే ఊరికి వెళ్లినట్లయితే సంబంధిత పోలీసు స్టేషన్ లో సమాచారం తెలిపితే బీటు సిబ్బందిచే నిఘా ఉంచుతారు. ( కాలనీలు, వీధులలో, పరిసర ప్రాంతాలలో) పోలీసు పెట్రోలింగ్ చేస్తూ రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రత్యేకంగా పోలీసు బృందాలు గా ఏర్పడి, పోలీసులు 24X 7 గస్తీ నిర్వహిస్తారు. పగలు దిశ టీం వారు, CCS సెంట్రల్ క్రైమ్ స్టేషన్ వారు, మఫ్టీ క్రైమ్ పార్టీ వింగ్, డే బ్ల్యూ కొట్స్ ఇలా పలు విభాగల పోలీసులు చోరీలను నివారించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా విధులు నిర్వహిస్తామన్నారు. తిరుపతి ప్రజలు కూడా పై నిబంధనలు పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని స్థానిక పోలీసులు విజ్ఞప్తి చేశారు.