Tirumala Brahmotsavam 2023: తిరుమలలో ఈ నెల 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం సెప్టెంబరు 17న అంకురార్పణ జరగనుంది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబరు 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. వాహనసేవలు ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు జరుగుతాయి. సెప్టెంబర్ 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
బ్రహ్మోత్సవాల షెడ్యూల్..
దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ ను టీటీడీ ప్రకటించింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. 17 సెప్టెంబర్ 2023 ఆదివారం రోజు అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధన ఉంటాయి. 18వ తేదీన ధ్వజారోహణ, 19వ తేదీ మంగళవారం రోజున ఉదయం చిన శేష వాహనం, రాత్రి 7 గంటలకు హంస వాహనంపైన శ్రీవారి ఊరేగింపు ఉంటుంది. 20వ తేదీన ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యాల పందిరి వాహనం పైన శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 21 సెప్టెంబర్ 2023 గురువారం రోజున ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వ భూపాల వాహనంపై శ్రీవారి మాడవీధుల్లో ఊరేగింపు ఉంటుంది. 22వ తేదీ శుక్రవారం రోజు శ్రీవారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం గరుడ వాహనంపైన ఊరేగుతారు. 23వ తేదీ శనివారం రోజుల హనుమంత వాహనం, సాయంత్రం గజ వాహనంపైన శ్రీవారు భక్తులకు దర్శన ఇస్తారు. 24వ తేదీన ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్ర చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తూ మాడవీధుల్లో ఊరేగింపు ఉంటుంది. 25వ తేదీన రథోత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం వేళ అశ్వవాహనం పై ఊరేగింపు ఉంటుంది. సెప్టెంబరు 26వ తేదీన శ్రీవారి పల్లకీ ఉత్సవం ఉంటుంది. చక్ర స్నానం, సాయంత్రం ధ్వజారోహనతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అక్టోబర్ 14వ తేదీన అంకురార్పణ జరగనుంది. అక్టోబర్ 15వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. అక్టోబర్ 23వ తేదీన నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్..
- 17.09.2023 - ఆదివారం - అంకురార్పణ - రాత్రి 7 నుండి 8 గంటల వరకు
- 18.09.2023 - సోమవారం - బంగారు తిరుచ్చి ఉత్సవం - మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు
ధ్వజారోహణం(మీన లగ్నం) - సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల వరకు.
పెద్దశేష వాహనం - రాత్రి 9 నుండి 11 గంటల వరకు. - 19.09.2023 - మంగళవారం - చిన్నశేష వాహనం - ఉదయం 8 నుంచి 10 గంటలకు వరకు
స్నపనతిరుమంజనం - మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు
హంస వాహనం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు - 20.09.2023 - బుధవారం - సింహ వాహనం - ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు
స్నపనతిరుమంజనం - మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు
ముత్యపుపందిరి వాహనం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు - 21.09.2023 - గురువారం - కల్పవృక్ష వాహనం - ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు
సర్వభూపాల వాహనం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు - 22.09.2023 - శుక్రవారం - మోహినీ అవతారం - ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు
గరుడసేవ - రాత్రి 7 గంటలకు ప్రారంభం - 23.09.2023 - శనివారం - హనుమంత వాహనం - ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు
స్వర్ణరథం - సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు
గజ వాహనం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు - 24.09.2023 - ఆదివారం - సూర్యప్రభ వాహనం - ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు
స్నపనతిరుమంజనం - మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు
చంద్రప్రభ వాహనం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు - 25.09.2023 - సోమవారం - రథోత్సవం- ఉదయం 6.55 గంటలకు
అశ్వ వాహనం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు - 26.09.2023 - మంగళవారం - పల్లకీ ఉత్సవం మరియు తిరుచ్చి ఉత్సవం - ఉదయం 3 నుండి 6 గంటల వరకు
స్నపనతిరుమంజనం మరియు చక్రస్నానం - ఉదయం 6 నుండి 9 గంటల వరకు
ధ్వజావరోహణం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు