Studio staff and security personnel clash in Tirumala:  తిరుమలలో విజిలెన్స్ సిబ్బంది,  స్టుడియో సిబ్బంది మధ్య  ఘర్షణ జరిగింది.  ఈ సంఘటన ఆస్థాన మండపంలో జరిగింది.  ఇక్కడ విజిలెన్స్ సెక్యూరిటీ గార్డు , ఒక దుకాణదారుడు   మధ్య మాటా మాటా పెరిగి  దాడికి దిగారు. ఇద్దరూ పిడిగుద్దులతో కొట్టుకున్నారు.  ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విజిలెన్స్ విభాగం విచారణ జరుపుతోంది.    గత కొంతకాలంగా TTD విజిలెన్స్ విభాగం తిరుమలలో అనధికార దుకాణాలను తొలగిస్తోంది. 

మరో వైపు తిరుమలలో కళాకారులను మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. 14 లక్షల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. TTD, HDPP  నాట్య కార్యక్రమం పేరుతో మోసం ఫేక్ చేశాడు. వరంగల్‌కు చెందిన అభిషేక్ 2 రోజుల పాటు శ్రీవారి కళార్చన పేరిట మోసం చేశారు. రెండు రాష్ట్రాల 93 బృందాల నుంచి 35 లక్షల రూపాయలు వసూలు చేశాడు. కళాకారులకు దర్శనం, వసతి, ప్రసాదం హామీ  ఇచ్చాడు. TTD అనుమతి లేకుండా ఫేక్ కార్యక్రమం చేపట్టిన వ్యక్తిపై  పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల I టౌన్ పోలీస్ స్టేషన్‌లో Cr. No.43/2025 ప్రకారం కేసు పెట్టారు. అభిషేక్‌ను జూలై 1న అరెస్ట్ చేసిన కోర్టులో ప్రవేశ పెటారు. ఫేక్ ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పదని హెచ్చరిచారు. 

మూడు రోజుల కిదట తిరుమలలో నిర్వహించే శ్రీశ్రీనివాస కళార్చనలో  ప్రదర్శన ఇచ్చేదుకు వేల మంది వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 2 వేల మంది కళాకారులు వచ్చారు. అయితే వారికి అనుమతి లేదు. తమ నుంచి ఓ వ్యక్తి రూ.2 వేలు వసూలు చేశారని వారు అదికారుల దృష్టికి తీసుకెళ్లారు. నృత్య ప్రదర్శనకు అనుమతి లేక పోవడంతో ఆస్థానమండపం వద్ద బారులు తీరారు. వారు చేసిన మోసాన్ని తెలుసుకుని అభిషేక్ ను అరెస్టు చేశారు.