Police suspends in Tirumala |తిరుపతి: శ్రీవారి ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో మద్యం మత్తులో ఏపిఏస్పి బెటాలియన్ పోలిసులు హల్ చల్ చేశారు. మద్యం మత్తులో సచివాలయం వద్ద తమ వాహనంతో, మరో వాహనాన్ని ఢీకొట్టారు. వేగంగా వాహనాన్ని ఢీకొట్టడంతో ఢీకొట్టడంతో టైరు కూడా పంక్చర్ అయింది.
ముగ్గురు పోలీసులు మద్యం సేవించి, పోలీసు వాహనంలో శుక్రవారం తిరుమలకు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలం నుంచి ఒక్కరు పరారయ్యారు. డ్రైవింగ్ చేసిన వారికి డ్రంక్ డైవ్ టెస్ట్ చేయగా 300 పాయింట్లు చూపించినట్లు సమాచారం. వెంటనే పోలీసులు స్పందించి ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు.
కానిస్టేబుల్స్ మీద వేటుతిరుమల కొండపై హల్చల్ చేసిన పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఈ ఘటనను పోలీసు శాఖ సీరియస్గా తీసుకుంది. మద్యం మత్తులో తిరుమలలో వాహనం నడవడంతోపాటు యాక్సిడెంట్ చేసిన పోలీసులను రాజశేఖర్, ఓంకార్ నాయక్, షేక్ సరావుద్దీన్ లుగా గుర్తించారు.
ఏపీఎస్పీ రెండవ బెటాలియన్ ఇన్చార్జ్ అధికారి రాజశేఖర్ కు మెమో జారీచేశారు. బెటాలియన్ కమాండెంట్ దీపిక పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. సామాన్య భక్తులే కొండపై ఎంతో నిష్టగా జాగ్రత్తగా ఉంటారు. కానీ పోలీసులే మద్యం సేవించి కొండపై హల్చల్ చేయడమేంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ వాహనం నడిపి యాక్సిడెంట్ చేయడంతో తమ సేఫ్టీపై భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు.