Chittoor Political News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత 2014 ఎన్నికల్లో అనుభవం కలిగిన నాయకుడు కావాలని ప్రజలు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కి ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు. 2019 ఎన్నికలు వచ్చే సరికి టీడీపీ ని పక్కన పెట్టి వైఎస్సార్ సీపీ కి దేశంలో ఏ రాష్ట్రంలో రాని విధంగా 151 స్థానాలతో అధికారం ఇచ్చారు. ఐదేళ్ల పాలన పూర్తి చేసుకుని వై నాట్ 175 అన్న పరిస్థితి నుంచి కేవలం 11 సీట్లకు పరిమితం చేసారు. వైసీపీ అధికారం లో ఉండి కూడా ప్రతిపక్ష పార్టీల పై మాటలు తూటాలు, వ్యక్తిగత జీవితాలు, బూతులు తో రాజకీయం చేసారని ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ సాధించిన సీట్లు అధికం అంటే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఓటమి తరువాత వైసీపీ కొన్ని రోజు పాటు నిరాసకు గురైంది. అయితే ఏమ్ కూటమి ప్రభుత్వానికి సమయం కూడా ఇవ్వకుండా ప్రతిపక్ష హోదా లేని పార్టీ గా మారినా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. కూటమి ప్రభుత్వం చేసే వాటిలో తప్పులను వెతుకుతూ నెల రోజుల నుంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. ఇక పై వచ్చే ఐదేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం ఓటమి సాధించేలా ప్రణాళికలను సిద్ధం చేసి అందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.


వారికి కీలక పదవులు


వైసీపీ అధికారంలోకి రావడానికి.. వచ్చిన తరువాత.. తిరిగి ఓటమి పాలైన తరువాత జగన్ కు అండగా నిలిచింది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మాజీ మంత్రి గానే కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుంగనూరు ఎమ్మెల్యే గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే గా పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి, రాజంపేట ఎంపీ గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గెలుపొందారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయనను వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC MEMBER)గా చిత్తూరు జిల్లా అధ్యక్షుడు మరియు తిరుపతి జిల్లా లోని తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల అధ్యక్షుడిగా ప్రకటించారు.


ఇక పార్టీ గెలుపు, ఓటమిలో భాగస్వామ్యం అయిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, వైసీపీ పార్టీ కి అనుకూలంగా మాట్లాడి... పవన్ కళ్యాణ్ పై దూషణలు చేసి ట్రోలింగ్ అయిన యాంకర్ శ్యామల కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధుల హోదా కల్పించారు. చివరి నిమిషంలో శ్యామల, అప్పుడు అప్పుడు జూపూడి ప్రభాకరరావు వైసీపీ నుంచి పొగిడే వారు. రోజా ప్రతిపక్ష పార్టీలపై మాటలు యుద్దం చేసేవారు. ఇక కరుణాకరరెడ్డి ఎవరిపై కూడా దూషణలు లేకుండా పార్టీ నిర్ణయం మేరకు పని చేసిన వ్యక్తిగా గుర్తింపు సాధించారు. వీరికి పార్టీ ఇచ్చిన హోదాల్లో ఏ మేరకు పని చేస్తారో వేచి చూడాలి.


నగరి నియోజకవర్గం లో సస్పెండ్


నగరి నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో రోజా అనుకూల వర్గం... వ్యతిరేక వర్గం ఉండేది. వ్యతిరేక వర్గం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులుగా చలామణి అయ్యారు. రోజాకు గతంలో ఎమ్మెల్యేగా ఉండగా ఫిర్యాదు చేసారని... మంత్రిగా ఉన్న సమయంలో పెద్దిరెడ్డి చెప్పింది చేయలేదని పలుమార్లు ఫిర్యాదులు సైతం చేసారని ఆరోపణలు స్వయాన వైసీపీ పార్టీలోని రోజా అనుకూల వర్గం చెప్పింది. పార్టీ ఓటమి తరువాత ఇటీవల నాయకులతో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఇందులో పార్టీకి, తనకు వ్యతిరేకంగా పని చేసిన ఇద్దరి గురించి రోజా జగన్ దృష్టికి తీసుకెళ్లింది. తన ఓటమిలో భాగస్వామ్యం ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. దానిపై స్పందించిన జగన్ నగరి నియోజకవర్గం నుంచి ఇద్దరు సీనియర్ నాయకులను పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని సస్పెండ్ చేశారు. అయితే ఇది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై కూడా వ్యతిరేకతకు కారణమని, ఆయన మాట కూడా పక్కన పెట్టి రోజా చెప్పిన వారినే సస్పెండ్ చేసారని కొందరు అంటున్నారు. ఇక వైసీపీ పార్చీ వచ్చే ఐదేళ్ల కాలంలో ఎలా ఉంటుందో అనేది వేచి చూడాలి.