Leopard In Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామి వద్దకు రోజూ వేల మంది భక్తులు వస్తుంటారు. కొందరు నేరుగా కొండపైకి చేరుకుంటారు. మరికొందరు కాలినడన అలిపిరి మార్గంలో దేవుని దర్శనానికి వెళ్తారు. ఇలా నడక ద్వారా వెళ్లే మార్గంలో తరచూ చిరుత కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. దీంతో ఒక్కసారిగా భక్తులు భయాందోళనకు గురయ్యారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద చిరుతను చూసిన వారంతా వణికిపోయారు. 

Continues below advertisement

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సమీపంలో శుక్రవారం రాత్రి చిరుతను చూసిన స్వామి భక్తులు భయంతో పరుగులు తీశారు. ఇంతలో కొందరు టీటీడీ సిబ్బంది సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఫారెస్టు సిబ్బంది స్పాట్‌కు చేరుకున్నారు. పెద్ద పెద్దగా అరుస్తూ ఆ ప్రాంతానికి వచ్చారు. వారి అరుపుల జనసంచారం చూసిన చిరుత అక్కడి నుంచి మెల్లిగా జారుకుంది. దీంతో భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు.  

ఆ ప్రాంతానికి ఒకసారి వచ్చి వెళ్లడంతో మళ్లీ వస్తుందేమో అని భక్తులు భయపడ్డారు. మళ్లీ చిరుతు రాదని ధైర్యం చెప్పిన సిబ్బంది,గుంపు గుంపులుగా వెళ్లాలని సూచించారు. స్వామి నామ జపం చేస్తూ వెళ్లాలని చెప్పారు. అక్కడ జనం ఉన్నారని తెలిస్తే అటవీ జంతువులు అటుగా రావని సలహా ఇచ్చారు. చిరుత వచ్చిన విషయాన్ని వీడియో తీసిన భక్తులు దాన్ని వైరల్ చేస్తున్నారు. గతంలో కూడా కాలినడక మార్గంలో పలు మార్లు చిరుత కనిపించింది. ఒక చిన్నారి ప్రాణం కూడా తీసేసింది. అందుకే ఈ మార్గంలో చిరుత పేరు చెబితేనే భక్తులు వణికిపోతున్నారు.   

Continues below advertisement