శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో హైటెన్షన్ వాతావరం నెలకొంది. నియోజకవర్గం అభివృద్ధిపై టీడీపీ,వైసీపీ మధ్య వార్ నడుస్తోంది. టీడీపీ లీడర్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే, వైసీపీ లీడర్ శ్రీధర్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. జిల్లా అభివృద్ధిపై సత్మెమ్మ ఆలయం వద్ద ప్రమాణానికి రావాలంటూ ఇరువురు నేతలు పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. 






ఉదయాన్నే పోలీసుల ఆంక్షలు ఛేదించుకొని శ్రీధర్ రెడ్డి సత్తెమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఆయన అనుచరులతో భారీగా అక్కడకు ఆయన వచ్చారు. అదే టైంలో పల్లె రఘునాథ్ రెడ్డి కూడా ఆలయం వద్దకు చేరుకునే ప్రయత్నాల్లో ఉండగానే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆయన్ని టీడీపీ ఆఫీస్‌లోనే నిర్బందించారు. ఆఫీస్‌ చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. ఎవర్నీ లోపలికి రానివ్వడం లేదు. లోపల ఉన్న వారిని బయటకు పోనివ్వడం లేదు.






టీడీపీ ఆఫీస్‌ వద్దకు వైసీపీ కార్యకర్తలు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు. ఒకరి వాహనాలును ఒకరు ధ్వంసం చేసుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే పోలీసుల కళ్లు గప్పి పల్లె రఘునాథ్ రెడ్డి కూడా సత్తెమ్మ దేవాలయానికి చేరుకున్నారు. కారుపైకి ఎక్కి వైసీపీ నేతలకు సవాల్ చేశారు. 






దాడిని ఖండించిన చంద్రబాబు


పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‍రెడ్డి వాహనం పై , టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు చంద్రబాబు. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ప్రతిరోజూ దాడులు సమాధానం కాలేవన్నారు. వైసీపీ దాడుల వెనుక వారి ఓటమి భయం, ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుందన్నారు.






వైసీపీపై మండిపడ్డ టీడీపీ నేతలు


జగన్ అండతో వైసీపీ రౌడీమూకలు పేట్రేగిపోతున్నాయన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని వైసీపీ ఎమ్మెల్యే అరాచకాలకు నిలయంగా మార్చారన్నారు. వైసీపీ రౌడీమూకలు దాడులు, దౌర్జన్యాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.