చిత్తూరు జిల్లాలో నలభై ఐదు రోజులు పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర తీరు ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని, అధికార పార్టీ వైసీపీ యువగళంను అడ్డుకునేందుకు వైసీపి సృష్టించిన అడ్డంకులు చిత్తూరు జిల్లా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు టిడిపి మాజీ మంత్రి అమర్నాథరెడ్డి. శనివారం సాయంత్రం పలమనేరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేష్ యువగళం పాదయాత్ర జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేశారు.
లోకేష్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో చరిత్ర..
చిత్తూరు జిల్లా చరిత్రలో దాదాపు 574కిలోమీటర్లు 14 నియోజకవర్గలు, అన్ని మండలాలు పాదయాత్ర చేసిన సందర్భం గతంలో ఎప్పుడూ లేదన్నారు.. ఈ జిల్లాలో ఇది ఒక చరిత్ర అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం మొదలు పెట్టిన రోజు చాలామంది చాలా మాట్లాడారని, కుప్పంలో ప్రారంభించిన సందర్భంలో మంత్రులుగానీ, ప్రభుత్వంలో ఉన్న వారు రకరకాల హేళన చేశారని, ఆ రోజే లోకేష్ బాబు కుప్పం బహిరంగ సభలో కొన్ని విషయాలు చెప్పడం జరిగిందన్నారు. ప్రారంభించిన రోజు నుంచి కూడా ప్రభుత్వం నుంచి అడ్డంకులు ఎదుర్కొన్నాంమని, ప్రతి చోట పోలీసులను అడ్డం పెట్టుకొని, స్థలాలు ఇవ్వకుండా బెదిరించడం, దారి పొడవునా భయబ్రాంతులకు పాల్పడడం, పోలీసులను పంపి జీవో.1 పేరుతో మైక్ లు లాక్కోవడం, మైక్ బండ్లు సీజ్ చేయడం, కనీసం స్టూల్ లు ఎక్కితే స్టూల్ లు లాక్కొనే పరిస్థితిని రాష్ట్రం మొత్తం కూడా గమనించారని ఆయన గుర్తు చేశారు. ఆ రకంగా ఓ భయానక పరిస్థితిని సృష్టించి ఏదో రకంగా ఈ పాదయాత్రను బెదిరించి భయపెట్టి ఆపే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి చేశారని ఆరోపించారు. ఐనా ఎక్కడ వెనక్కి తగ్గకుండా దాదాపు ఈ జిల్లాలో 25 కేసులు పెట్టారని, లోకేష్ బాబు పైన మూడు కేసులు, నాపై ఆరు కేసులున్నాయని, 307, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ,353 అన్ని రకాల కేసులు పెట్టినా పార్టీకీ సంబంధించిన కార్యకర్తలు గానీ మరి ముఖ్యంగా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెంలో ఏమాత్రం వెనక్కు తగ్గకుండా నిలబడి పోరాడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేవారు.
ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని తిట్టేందుకే లోకేష్ బాబు పాదయాత్ర చేస్తున్నారని మాట్లాడారని, సీఎంని తిట్టడం కాదని, ప్రజల యొక్క గొంతుకగా, వారి బాధలు, మైనారిటీలు, ఎస్సీ,ఎస్టీ, బీసీలు, అన్ని వర్గాల వారిని ఏ రకంగా అనగదొక్కి హింసిస్తున్నారని, ఏ రకంగా తప్పుడు కేసులు పెట్టారని ప్రజలకు తెలిపేందుకు యువగళం అన్నారు అమర్నాథరెడ్డి. ఏ రకంగా భూములు లాక్కున్నారని, ఏ రకంగా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారనేది ప్రజలకు తెలిపేందుకే ఈ పాదయాత్ర లోకేష్ చేపట్టినట్లు చేప్పారు. మా ముందే ఇసుక లారీలు తరులుతున్నాయని, వాటిని ఫొటోస్ తీశాంమని, ఎక్కడ చూసినా కొండలు తవ్వేస్తున్నారని, అవ్వన్నీ లోకేష్ సెల్ఫీలు తీసి పంపారన్నారు. మీరు తెచ్చింది ఏ ఒక్కటైనా జిల్లాలో నాయకులు గానీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గానీ తెచ్చినవి ఎక్కడైనా సెల్ఫీలు తీసి చూపించగలరా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రతి సందర్భంలో యువతకు సంబంధించిన సమావేశాల్లో యువత ఆవేదన చూశాంమని, వారికి ఉపాధి అవకాశాలు లేకుండా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, వారి ఆవేదనను ప్రభుత్వానికి చెబితే కనువిప్పు కలుగుతుందని ప్రయత్నం చేశామన్నారు. చెప్పడమే కాదు... మేము వస్తే ఏం చేస్తామో కూడా వివరించాంమని, మీరు చేసిన తప్పులు చెప్పాంమని, గతంలో మేం చేసిన అభివృద్ధి సెల్ఫీల రూపంలో చూపించాంమని, భవిష్యత్తులో ఏం చేస్తామో చెప్పామన్నారు.
లోకేష్ పాదయాత్రలో దాదాపు వెయ్యి మంది పోలీసులని, ఆరేడు మంది డీఎస్పీలాని, 20 మంది సీఐ లా,50 మంది ఎస్ఐ లా అంతమంది ఎందుకు లోకేష్ బాబు యాత్రకు వచ్చారో అర్ధం కావడం లేదన్నారు. ఎక్కడైనా ఆయనకు సెక్యూరిటీ ఇచ్చే ప్రయత్నం చేశారా అంటూ ఆయన ప్రశ్నించారు. శుక్రవారం చిత్తూరు జిల్లా నుంచి అనంతపురం జిల్లాకు ఆయనను పంపించే తరుణంలో ఆయన చేయి బట్టి లాగేశారని, ఈరోజు చేయి కూడా ఎత్తలేని పరిస్థితి లోకేష్ దన్నారు.
చంద్రబాబు హయాంలో జగన్ కు అడ్డంకులు కల్గించలేదు..
గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఎప్పుడైనా ఆ రోజు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మీకు ఎప్పుడైనా ఏదైనా అడ్డంకులు వచ్చాయా అంటూ ఆయన ప్రశ్నించారు.. పోలీసులు మీ వెంట ఉండి మీకు సెక్యూరిటీ ఇచ్చిన పరిస్థితి లేదా అని, ఈరోజు లోకేష్ బాబుకు సెక్యూరిటీ ఇవ్వడం కంటే కూడా ఆయన అడ్డుకోవాలనే ఆలోచనే తప్పా మీరేమైనా సెక్యూరిటీ ఇచ్చిన పరిస్థితి ఉందా అని అడిగారు. అదే కాకుండా ఈ జిల్లాలో ప్రతి వంద కిలోమీటర్లకు ఒక శిలాఫలకం వేసాంమని, ఆ శిలాఫలకాలతో ప్రతి నియోజకవర్గంలో ఏం చేస్తామో స్పష్టంగా చెప్పాంమన్నారు.. ఈరోజు పూతలపట్టు నియోజకవర్గంలో 8వ రోజు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ కేంద్రాన్ని చేస్తామని మాట ఇచ్చాంమని, ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో అన్ని పూర్తి చేసి ఇస్తామని హామీ ఇచ్చాంమని, అదేవిధంగా 200 కిలోమీటర్లు చేరుకున్న సందర్బంగా జీడి నెల్లూరులో 16వ రోజు మహిళా డిగ్రీ కళాశాల ఆ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఏర్పాటు చేస్తామని చెప్పాంమని, అదేవిధంగా 300 కిలోమీటర్ల కు సంబందించి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తొండమనాడు వద్ద దాదాపు 13 గ్రామాలకు తాగునీటికి సంబంధించిన సమస్య ఉంటే పరిష్కరిస్తాంమని, పాకాల మండలంలో 400 కిలోమీటర్ కు చేరుకోగానే అక్కడి వారి చిరకాల కోరిక ఐనా ఆధునిక వసతులతో పది పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా సిటిఎంలో 500 కిలోమీటర్ల సంబంధించిన పాదయాత్రలో మదనపల్లి ప్రాంతంలో టమేటాకు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్ను, కోల్డ్ స్టోరేజ్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చామన్నారు.
ఒక రకంగా కాదు ప్రజా సమస్యలను ప్రస్తావించాంమని, ప్రభుత్వ అవినీతిని ప్రస్తావించాంమని, శాసనసభ్యులు చేసే అవినీతిని ప్రస్తావించాంమని, ఈ విధంగా ఉమ్మడి జిల్లాలో పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసాంమన్నారు.. ఎప్పుడు గతంలో ఎవరూ చేయనటువంటి కార్యక్రమాన్ని ఈ జిల్లాలో చేసాంమని, శాసనమండలి సంబంధించి దానికి సంబంధించిన నిర్ణయం కూడా ఈ రాష్ట్రంలో పాత ఉమ్మడి 13 జిల్లాలుంటే 9 జిల్లాలలో ఎన్నికలు నడిచాయన్నారు.. చాలా సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఇదొక రెఫరండం అని చెప్పారని, ఉత్తరాంధ్రలో అయితే అక్కడ నేను క్యాపిటల్ తీసుకొస్తున్న రాజధానికి సంబంధించినటువంటి రిఫరెండం అని చెప్పారన్నారు. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో వైయస్సార్సీపీకి తిరుగు లేదని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి మాటలు కనీసం ఆయన సొంత నియోజకవర్గంలో తూర్పు పశ్చిమ, రాయలసీమకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలలో అక్కడ కూడా టిడిపి విజయ డంకా మోగించిందన్నారు.. తొమ్మిది జిల్లాలలో మీపైన ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఈ రోజు చదువుకున్నటువంటి యువకులు భవిష్యత్ తరాలు మీ గురించి, మీ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారో ఓటు రూపంలో చూపారన్నారు.. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరచి ఇలాంటివి మానుకోండని, ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేద్దామని అలోచిస్తున్నారని మండిపడ్డారు.. ఇది 2024 జరగబోవు శాసనసభ ఎన్నికలకు ముందస్తుగా సెమీ ఫైనల్గా భావించామని, ఇది ఒక ట్రయల్ మాత్రమే అని, 2024లో దీనికి రెట్టింపుగా రాష్ట్రం మొత్తం సైకిల్ హవా నడుస్తుందన్నారు.. ఫ్యాన్ సింగిల్ డిజిట్ లో నిలిచిపోయేది ఖాయంమని ఆయన హెచ్చరించారు..